• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు మరో షాక్.. అధినేతకు సన్నిహితుడిగా శివప్రసాద్.. టీడీపీలో శివప్రసాద్ కీ రోల్!

|

మాజీ ఎంపీ శివప్రసాద్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నా..పార్టీ అధినేతగా ఆయన మాట ఏనాడు కాదనలేదు. చిత్తూరు జిల్లాలో టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న సమయంలో ఆయన వైద్యుగా పని చేస్తూనే..సినీ రంగంలో అనేక పాత్రలు చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన కీలకంగా మారారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేసారు. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పని చేసిన శివ ప్రసాద్.. రెండు సార్లు ఎంపీగా చేసారు.

రాజకీయంగా టీడీపీ వాయిస్ సభలో వినిపించే అవకాశం లేకపోయినా..తన వేష ధారణలతో పార్లమంట్ ప్రాంగణంలో అందరినీ ఆకర్షించేవారు. పద్యాలు పాడుతూ..తన నిరసన వ్యక్తం చేసేవారు. ఏపీకి విభజన హామీలు అమలు కోసం వేష ధారణతో సభలోకి వచ్చి.. స్పీకర్ పోడియం దగ్గరకు రావటంతో శివ ప్రసాద్ మీద స్పీకర్ ఆగ్రహం సైతం వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న శివ ప్రసాద్ మరణం ఇప్పుడు పార్టీలో విషాధం నింపింది.

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ రాజకీయ ప్రస్థానం..

శివప్రసాద్ రాజకీయ ప్రస్థానం..

టీడీపీ సీనియర్ నేత శివ ప్రసాద్ కన్నుమూసారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాలో 1951 జూలై 11న జన్మించిన శివ ప్రసాద్ జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇక్కడే ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి ఆప్తులుగా ఉన్నారు.

నటుడిగా, వైద్యుడిగా రాణిస్తూనే..

నటుడిగా, వైద్యుడిగా రాణిస్తూనే..

శివప్రసాద్ పలు సినిమాల్లో కూడా నటించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు. అనేక సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేశారు. ఆయన చంద్రబాబుతో ఉన్న పరిచయంతో రాజకీయంగా ఉన్న ఆసక్తి కారణంగా టీడీపీలో చేరారు. 1999లో సత్యవేడు ఎమ్మెల్యేగా చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేసారు. ఆ ఎన్నికల్లో శివప్రసాద్ గెలుపొందారు. ఆయనకు చంద్రబాబు 1999-2001 వరకు తన కేబినెట్ లో మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ట్ర సమాచార..కల్చరల్ శాఖా మంత్రిగా ఆయన పని చేసారు. ఒక సారి ఎమ్మెల్యేగా పని చేసిన శివ ప్రసాద్ ఆ తరువాత చిత్తూరు నుండే రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. టిడిపి సాంస్కృతిక విభాగానికి ఆయన నాయకత్వం వహించారు.

సమైక్యవాదం వినిపించటంలో వినూత్నంగా..

సమైక్యవాదం వినిపించటంలో వినూత్నంగా..

2009లో శివప్రసాద్ తొలి సారి చిత్తూరు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనలు నిర్వహించారు. టీడీపీ నుండి తెలంగాణ ఎంపీలు విభజనకు అనుకూలంగా.. అదే విధంగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలు విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులతో కలిసి నినాదాలు చేసేవారు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందుగానే పార్లమెంట్ గేట్ వద్ద విచిత్ర వేషధారణలతో తమ సమస్యలను అందరికీ తెలిసేలా చేయటంలో ముందుడేవారు. అప్పుడు సోనియా గాంధీ..హోం మంత్రిగా పని చేసిన సుశీల్ కుమార్ షిండేను అభ్యర్దిస్తూ పద్యాలు పాడేవారు. సభను అడ్డుకుంటున్నారనే కారణంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయగా అందులో శివ ప్రసాద్ సైతం ఉన్నారు.

ఏపీ విభజన సమయంలో కూడా

ఏపీ విభజన సమయంలో కూడా

ఇక, తిరిగి 2014లో చిత్తూరు నుండి శివ ప్రసాద్ ఎంపీగా గెలిచారు. ఏపీకి విభజన అంశాల అమల్లో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత ఏడాది వర్షాకాల సమావేశాలు మొత్తం టీడీపీ సభ్యులు ఆందోళన చేసారు. ఆ సమయంలో శివ ప్రసాద్ ప్రధాని మోదీ వేషం తో పాటుగా వెంకటేశ్వరుడి వేషం ..అదే విధంగా అనేక విధాలుగా ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కోసం ఆందోళన కొనసాగించారు. ఒక సందర్బంలో సత్య హరిశ్చంద్రుడి వేష ధారణతో సభలోకి శివ ప్రసాద్ వెళ్లగా..స్పీకర్ మందలించారు.

2019 ఎన్నికల్లో ఓటమి..అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా..

2019 ఎన్నికల్లో ఓటమి..అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా..

గత ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శివ ప్రసాద్ తిరిగి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా చిత్తూరు నుండి పోటీ చేసారు. వైసీపీ అభ్యర్ది రెడ్డప్ప చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆరోగ్య పరమైన సమస్యలు సైతం రావటంతో ఆయన క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం ఆయన కన్ను మూసారు. శివ ప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి లోకేశ్ సంతాపం వ్యక్తం చేసారు. సమైక్య ఉద్యమంలో శివ ప్రసాద్ పోరాటాన్ని చంద్రబాబు గుర్తు చేసారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ex MP Sivaprasad former tdp mp passes away. He worked in TDp nearly more than two decades. Siva prasad elected as Mla and two times as Chittor MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more