• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అలా చేస్తే సీఎంగా జ‌గ‌న్ 30ఏళ్లు : ఆ వ్యాఖ్య‌ల‌తో విభేదిస్తున్నా: ఉండ‌వ‌ల్లి అరుణ‌కుమార్‌..!

|
  అలా చేస్తే సీఎంగా జ‌గ‌న్ 30ఏళ్లు... ఉండ‌వ‌ల్లి అరుణ‌కుమార్‌ || Oneindia Telugu

  ఏపీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు.నిజంగా అవినీతి లేకుండా పాల‌న అందిస్తే 30 ఏళ్ల‌పాటు జ‌గ‌న్ సీఎంగా ఉంటార‌న్నారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న లక్షకోట్ల ఆరోపణలను ఒప్పుకోలేదు. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్‌ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించార‌ని చెప్పుకొచ్చారు.

  చంద్ర‌బాబు సొంత జిల్లాలో అస‌మ్మ‌తి సెగ‌! ఓడిన‌ అభ్య‌ర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?

  ఆ వ్యాఖ్య‌ల‌తో విభేదిస్తున్నాను..

  ఆ వ్యాఖ్య‌ల‌తో విభేదిస్తున్నాను..

  కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం లేదు కాబట్టి, ప్రధానిని కలిసిన ప్రతిసారీ అడిగి ప్రత్యేకహోదా తెచ్చుకోవాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌. దీని పైన జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను విభేదిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసారు.ప్రత్యేకహోదా విభజన చట్టంలో ఉందని.. ఇచ్చి తీరాల్సిందేనన్నారు.

  అవినీతి రహిత పాలన అందిస్తామని జగన్‌ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులకు జగన్‌ వ్యాఖ్యలు నాంది అని పేర్కొన్నారు. ఇసుక మాఫియాను మొదట అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారుగా అజయ్‌కల్లాం నియామకం హర్షనీయమని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. చంద్రబాబుపై నెగిటివ్‌ ఓటుతో జగన్‌ అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్‌కు ఓటేశారన్నారు. జగన్‌ 50శాతం ఓట్లతో గెలవడం గొప్ప విషయమని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

  ల‌క్ష కోట్ల అరోప‌ణ‌లు ఒప్పుకోలేదు..

  ల‌క్ష కోట్ల అరోప‌ణ‌లు ఒప్పుకోలేదు..

  ఎన్నికల్లో టీడీపీకి చెందిన హేమాహేమీలు ఓడిపోయారున్నారు. పాజిటివ్ ఓటుతో వచ్చిన ప్రభుత్వాలకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం రేట్లు పెంచే విషయంపై పీపీఏను సంప్రదించారా అని అధికారులను అడిగినా... సమాధానం ఇప్పటివరకూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. చేసిన పనికన్నా ప్రచారం ఎక్కువ చేసుకోబట్టే చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న లక్షకోట్ల ఆరోపణలను ప్ర‌జ‌ల‌ను ఒప్పుకోలేదని.. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్‌ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించారని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. పోలవరం పనులపై జ్యుడిషీయల్‌ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్‌ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్‌ జగన్‌కు సూచించారు.

  ఇలా చేస్తే 30ఏళ్లే అతనే సీఎంగా..

  ఇలా చేస్తే 30ఏళ్లే అతనే సీఎంగా..

  ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సామరస్యంగా ఉండడమే మంచిదని ఉండ‌వ‌ల్లి అభిప్రాయం వ్యక్తం చేసారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 23వేలకోట్ల ఆస్తులు ఇప్పటి వరకు రాలేదని గుర్తుచేశారు. వాన్‌పీక్‌ వైఎస్సార్‌ డ్రీమ్‌ అని.. దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్‌ జగన్‌ ఇక్కడ కూడా అమలుచేస్తే.. మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి త‌న అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

  English summary
  Ex MP Undavalli Arun Kumar differed with Jagan comments on Modi in AP Assistance. Undavalli says If Jagan really control corruption then ha may continue as CM for 30 years.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more