హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీపుల్స్‌వార్ మాజీ అరెస్టు, నాటు తుపాకి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పక్కా సమాచారం మేరకు కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సెంట్రల్ జోన్ పోలీసులు పీపుల్స్‌వార్ మాజీ సభ్యుడు బండారు హనుమంత రాయుడు అలియాస్ హనుమంతు అలియాస్ సంజీవ్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి 9 ఎంఎం నాటు తుపాకిని, క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. హనుమంతరాయుడు అనంతపురం జిల్లాలోని పిచ్చిరెడ్డి కొత్తల రామగిరికి చెందినవాడు.

పోలీసులు తమకు అందిన సమాచారంతో దాడి చేసి సికింద్రాబాద్‌లోని చిలకలగుడా గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు పట్టుకున్నారు. అక్కడ హనుమంతరాయుడు బండ్లగూడాకు చెందిన తన మిత్రుడు ఆరీఫ్ ఖాన్‌ కోసం నిరీక్షిస్తున్నాడు.

అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్ కోటి రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐలు ఎస్ సైదాబాబు, పి. రాఘవేందర్, వినోద్ కుమార్‌ల సాయంతో ఇన్‌స్పెక్టర్ ఎ భాస్కర్ సెంట్రల్ జోన్ సిబ్బందితో హనుమంత రాయుడిని పట్టుకున్నారు.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

అనంతపురం జిల్లాకు చెందిన గత పీపుల్స్‌వార్ మాజీ నక్సలైట్ హనుమంత రాయుడు అలియాస్ హనుమంత్ అలియాస్ సంజీవ్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సెంట్రల్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

హనుమంతరాయుడు సోదరి శ్రీదేవి అలియాస్ నిర్మల కూడా గత పీపుల్స్ వార్‌లో పనిచేసింది. ఆమె పెన్న అహోబిల దళం మాజీ కమాండర్ నర్సింహా రెడ్డి అలియాస్ శేఖర్‌ను వివాహం చేసుకుంది. వీరి స్పూర్తితోనే హనుమంత రాయుడు పీపుల్స్‌వార్‌లో చేరాడు. గణపతి దళంలో పనిచేశాడు.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - శ్రీదేవి అలియాస్ నిర్మల అనంతపురం జిల్లా కూడేరు మండలం అంసాయిపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించింది. ఆ తర్వాత 1995లో హనుమంతరాయుడు అనంతపురం జిల్లా సికె పల్లి పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముందు లొంగిపోయాడు. అతని బావ నర్సింహా రెడ్డి అలియాస్ శేఖర్ పీపుల్స్‌వార్‌లో కొనసాగాడు.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

నర్సింహా రెడ్డి అలియాస్ శేఖర్ ఆత్మరక్షణ కోసం హనుమంత రాయుడికి 9ఎంఎం నాటు తుపాకిని, 3 లైవ్ క్యాట్రిడ్జ్‌లను ఇచ్చాడు. అప్పటి నుంచి వాటిని తన వద్ద హనుమంతరాయుడు ఉంచుకున్నాడు. ఆ తర్వాత 1998లో చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో నర్సింహా రెడ్డి అలియాస్ శేఖర్ మరణించాడు.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

గత పీపుల్స్‌వార్ మాజీ సభ్యుడు హనుమంతరాయుడు అలియాస్ హనుమంతు అలియాస్ సంజీవ్ వద్ద స్వాధీనం చేసుకున్న నాటు తుపాకి ఇదే.

మాజీ నక్సలైట్ పట్టివేత

మాజీ నక్సలైట్ పట్టివేత

ఓ మిత్రుడి కోసం సికింద్రాబాదులోని చిలకలగుడా వద్ద నిరీక్షిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు హనుమంతరాయుడిని పట్టుకున్నారు.

English summary
The sleuths of Commissioner's task force Central zone team nabbed Ex PWG member Bandaru Hanumanth Rayudu alias Hanumanth alias Sanjeev in Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X