వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!

|
Google Oneindia TeluguNews

ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా కుమార్తె పెళ్ళి, దయచేసి రాకండి అంటూ వినూత్నంగా పత్రిక వేయించారు. ఇదిగో ఆహ్వానం... కానీ ఎవరూ రాకండి... పెళ్లి చూడాలంటే ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూడండి అంటూ పత్రిక వేయించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

అన్నంతపని చేసిన అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు .. గణపతి ఆలయంలో సతీ సమేతంగా సత్య ప్రమాణాలుఅన్నంతపని చేసిన అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు .. గణపతి ఆలయంలో సతీ సమేతంగా సత్య ప్రమాణాలు

కరోనా కారణంగా పెళ్ళికి రాకండి . చింతమనేని విజ్ఞప్తి

కరోనా కారణంగా పెళ్ళికి రాకండి . చింతమనేని విజ్ఞప్తి

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి ఆహ్వాన పత్రిక వేయించారు. 2021 సంవత్సరం జనవరి 2వ తేదీన తన కుమార్తె వివాహం జరగనుందని ఆహ్వాన పత్రికలో వెల్లడించారు. మా శ్రేయోభిలాషులు అయిన మిమ్మల్నందర్నీ ఆహ్వానించి నూతన దంపతులకు ఆశీస్సులు అందించాలని కోరడానికి కరోనా వ్యాప్తి ఉన్న విషయం మీకందరికీ తెలిసిందే కాబట్టి పరిస్థితిని గమనించి సహృదయంతో మీ గృహాల నుండి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించవలసిందిగా కోరుచున్నాము అని చింతమనేని ప్రభాకర్ వివాహ ఆహ్వానం చెబుతూనే రావద్దని కోరారు.

పెళ్లిని ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్ , ట్విట్టర్ లలో చూడండి

పెళ్లిని ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్ , ట్విట్టర్ లలో చూడండి

ఇక పెళ్లిని చూడాలనుకున్న వాళ్ళు ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ,ట్విట్టర్లలో చింతమనేని ప్రభాకర్ పేజీ పైన పెళ్లిని చూడొచ్చు అంటూ అందులో పేర్కొన్నారు.

తమ కుమార్తె పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని అందరికీ చెప్పడంతో పాటుగా, స్వీట్ బాక్స్ లు కూడా అందిస్తూ ఈ సందేశాన్ని స్వీట్ బాక్స్ కు అంటించి పంపించారు. కరోనా కారణంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చింతమనేని ప్రభాకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

 కరోనా సమయంలో చింతమనేని సామాజిక బాధ్యత .. కుమార్తె పెళ్లి కి రావద్దని కోరిన టీడీపీ నేత

కరోనా సమయంలో చింతమనేని సామాజిక బాధ్యత .. కుమార్తె పెళ్లి కి రావద్దని కోరిన టీడీపీ నేత

ఏది ఏమైనప్పటికీ ఎవరైనా పిల్లల వివాహాన్ని బంధుమిత్రులు సకుటుంబ సపరివార సమేతంగా, శ్రేయోభిలాషులు అందరి మధ్య అట్టహాసంగా నిర్వహించాలి అనుకుంటే, టిడిపి నేత, సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అయిన చింతమనేని ప్రభాకర్ తమ కుమార్తె పెళ్ళికి ఎవరూ రావద్దు అంటూ విజ్ఞప్తి చేయడం ఆసక్తికర పరిణామం.కరోనా ఉన్న లెక్క చెయ్యకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెళ్ళిళ్ళు చేస్తున్న వారు లేకపోలేదు . కానీ ప్రజా ప్రతినిధిగా పని చేసి రాజకీయాల్లో ఉన్న నేత అయిన చింతమనేని కరోనా సమయంలో సామాజిక బాధ్యత తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిమానులు చెప్తున్నారు .

English summary
Chintamaneni Prabhakar, who is a TDP Ex MLA, wrote an innovative information saying that his daughter should get married Here is the invitation ... but no one should come ... If you want to see the wedding, look on Facebook, Instagram, YouTube and twitter . the wedding information without invitation has become a topic of discussion in the state of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X