వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఏజెన్సీలో గంజాయిపై ఎక్సైజ్ పంజా.. కోట్ల విలువైన సరుకుపై కొరడా

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది . గత కొంత కాలంగా విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు సైతం విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా అవుతుంది. అంబులెన్స్ , బొగ్గు లారీ , ఇటుకల లారీ ఇలా గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అర్ధం కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. . అటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నప్పటికీ, అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ వీరిని పట్టుకోవడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలమవుతున్నారు అన్న భావన ఎప్పటి నుండో వుంది. అయితే తాజాగా విశాఖ ఏజెన్సీ లో గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ శాఖ పోలీసులు పంజా విసిరారు.

కేసీఆర్ బాటలో జగన్: తెలంగాణలో ఇప్పటికే ఆ స్కీమ్..ఏపీలో అక్టోబర్ 10న ప్రారంభంకేసీఆర్ బాటలో జగన్: తెలంగాణలో ఇప్పటికే ఆ స్కీమ్..ఏపీలో అక్టోబర్ 10న ప్రారంభం

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

తాజాగా విశాఖ ఏజెన్సీ లో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరు టన్నుల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 5 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎక్సైజ్ పోలీసులు భారీ మొత్తంలో పట్టుకున్న గంజాయికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.ఇంత భారీ మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు .

విశాఖ ఏజెన్సీలో గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

విశాఖ ఏజెన్సీలో గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపట్టు మండలం మారుమూల బిర్రిగుడ ఇళ్లల్లో భారీ మొత్తంలో గంజాయి నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముంచంగిపుట్టు పోలీసుల సహాయంతో బిర్రిగుడ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలోని మూడిళ్లలో బ్యాగులలో ప్యాక్ చేసి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 6 టన్నుల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. గంజాయి బ్యాగులను పాడేరు ఎక్సైజ్ స్టేషన్ కి తరలించి, గంజాయి నిల్వ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి దందా

విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి దందా

విశాఖ ఏజెన్సీ వేదికగా పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు గత కొంత కాలంగా భారీగా పట్టుబడుతున్న గంజాయి కేసులతో తేటతెల్లమవుతుంది. గంజాయి అక్రమ రవాణాకు తెలుగు రాష్ట్రాల కేంద్రంగా హైటెక్ ముఠా పని చేస్తుందని అర్థమవుతుంది. గంజాయి సాగుకు మూలాలు మాత్రం విశాఖ ఎజెంసీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయి నుండి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, సంబంధిత శాఖల పైన ఉంది.

 గంజాయిని అరికట్టలేకపోతున్న సంబంధిత శాఖలు

గంజాయిని అరికట్టలేకపోతున్న సంబంధిత శాఖలు

అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , నార్కోటిక్స్, రెవెన్యూ అధికారులు గంజాయి సాగును, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయటంలో దారుణంగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తాయి . అయితే తాజాగా ఇంత భారీ మొత్తంలో గంజాయిని పట్టుకోవటంతో ఎక్సైజ్ పోలీసులు తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పినట్టు అయ్యింది. అయితే కూకటి వేళ్ళతో సహా ఈ గంజాయి మహమ్మారిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

English summary
Excise police have been informed that a large number of marijuana stores are located in remote Biriguda houses in the vicinity of Visakha Agency. Immediately thereafter, the alert excise police carried out inspections at the Birriguda houses with the help of the local police. Excise police have seized 6 tonnes of marijuana that were packed in bags and ready to be shipped in three of the houses. The marijuana bags were moved to the Excise Station and cases were registered against those who stored marijuana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X