వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll.. ఏ సర్వే ఏం చెప్పింది..: జగన్‌కు చంద్రబాబు గట్టి పోటీ, కేసీఆర్ ఆశలు గల్లంతు!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: ఎగ్జిట్ పోల్ సరళిని చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుంది. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవనుంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా కూడా ఉన్నాయి. తొలిసారి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన సింగిల్ డిపాజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో వైసీపీ హవానే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, తెలంగాణలో కేసీఆర్ కోరుకున్న 16 సీట్లు రాకపోయినా, మెజార్టీ సీట్లు మాత్రం తెరాసవే.

ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...

ఏ సర్వే ఏం చెప్పింది?

ఏ సర్వే ఏం చెప్పింది?

- లగడపాటి సర్వే - వైసీపీకి 65-79, టీడీపీకి 90-110, జనసేనకు 1, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 0

- పీపుల్స్ ప్లస్ సర్వే - వైసీపీకి 112, టీడీపీకి 59, జనసేనకు 4
- మిషన్ చాణక్య- వైసీపీకి 91-105, టీడీపీకి 55-61, జనసేనకు 5-9
- ఇండియా టుడే - వైసీపీకి 130-135, టీడీపీకి 37 - 40, జనసేనకు 0-1
- సీపీఎస్ సర్వే - వైసీపీకి 130 - 133, టీడీపీకి 43 -44, జనసేనకు 0-1
- ఆరా సర్వే - వైసీపీకి 120 - 125, టీడీపీకి 50 - 55
- వీడీపీఏ అసోసియేట్స్ - వైసీపీకి 111 - 121, టీడీపీకి 54 - 60, జనసేనకు 0-4
-

టీడీపీకి అనుకూలంగా కొన్ని ఫలితాలు

టీడీపీకి అనుకూలంగా కొన్ని ఫలితాలు

ఏపీలో వైసీపీదే అధికారం అని ఎక్కువ సర్వేలు చెబుతుండగా, లగడపాటి సర్వే, రిపబ్లిక్ సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. టీడీపీ 14 లోకసభ స్థానాలు, వైసీపీ 11 లోకసభ స్థానాలు గెలుస్తుందని రిపబ్లిక్ - సీ ఓటరు సర్వే తెలిపింది. చాణక్య-న్యూస్24 టీడీపీకి 17 సీట్లు, వైసీపీకి 8 లోకసభ సీట్లు అంచనా వేసింది. ఈ లెక్కన టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మే 23న ఫలితాలు వచ్చాకే గెలుపు ఎవరిది అనేది తేలనుంది.

టీఆర్ఎస్

టీఆర్ఎస్

తెలంగాణలో అన్ని సర్వేల్లోను తెరాస (లోకసభ) హవా కనిపించింది. గత ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస సత్తా చాటింది. లోకసభ ఎన్నికల్లోను 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలుచుకోనుంది. ఏబీపీ, వీడీపీ, మిషన్ చాణక్య సర్వేలు.. టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో గెలుస్తోందని అంచనా వేశాయి. మిగిలిన ఒక్క స్థానం మజ్లిస్ ఖాతాలోకి వెళ్తుందని తెలిపాయి. సీ-ఓటర్ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 14 స్థానాలు, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క స్థానంలో గెలవనున్నాయి. ఇండియా టుడే సర్వే.. టీఆర్‌ఎస్ 10 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశముంది. తాము 16 సీట్లు గెలుచుకుంటామని కేసీఆర్ పదేపదే చెప్పారు. కానీ ఆ పరిస్థితి తక్కువగా కనిపిస్తోంది. అలాగే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ వస్తోంది. దీంతో ఎవరికీ మెజార్టీ లేకుంటే చక్రం తిప్పుతామని భావించిన కేసీఆర్ ఆశలు అడియాసలే.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu may get another term in the state, but his dream to play kingmaker at the Centre is unlikely to take off with arch rival Jagan Mohan Reddy making significant dent in the Lok Sabha elections, according to most exit polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X