వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెండర్‌, ప్రాంతీయ తాత్వికతల 'చిత్రలిపి' (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక, భారతీయ సాంస్కృతి సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ఛాయాచిత్రకారుడు కందుకూరి రమేష్ బాబు తీసిన సంక్రాంతి ముగ్గుల ప్రదర్శన హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏర్పాటైంది. శనివారంనాడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కవితా ప్రసాద్, బి. నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన రేపు జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్రదర్శనపై ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర వ్యక్తం చేసిన అభిప్రాయం ఇలా ఉంది...

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కందుకూరి రమేష్‌ బాబు ప్రదర్శిస్తున్న ముగ్గుల ఛాయాచిత్ర ప్రదర్శన 'చిత్రలిపి'పై ఒక స్పందన-

జెండర్‌, ప్రాంతీయ తాత్వికతల సంలీనం రమేష్‌ 'చిత్రలిపి'

మట్టి ఇంకో రూపం సుద్ద. తన రూపాన్ని మరో రూపంతో సింగారిచ్చుకునే కళ ముగ్గు. పచ్చటి అలుకేసుకొని ఎర్రటి తరుగులు అలుక్కొన్న కాన్వాస్‌లో ఆడవాల్లు తమ తనవి తీర రకరకాల క్రియేషన్స్‌తో ఒక ఆత్మానందం, ఒక తుర్తి ఒక ఆనందం.... అది చూసినోల్లంత సంబురపడేది ముగ్గు. యిదే చిత్రలిపి అయిందేమో! ఈ తపన, అందం, దాంట్లోని సామాజికత ప్రాంతీయత, జీవనం, జీవితం కందుకూరి రమేష్‌ బాబు ప్రదర్శిస్తున్న 'చిత్రలిపి'లో ఎంత మంచిగ రిఫ్లెక్ట్‌ అవుతున్నాయో! వాటిలోని తాత్వికత నన్ను చాలా ఆకట్టుకుంది.

తెలంగాణ గోటి ముగ్గు చాలా అద్భుతంగా వుండేది. అలి చాలా టాలెంటెడ్‌గా అద్భుతంగా వుంటది. ప్రదర్శనలో వుంచిన చిత్రాలు ఎన్నింటినో యాది చేస్తున్నయి.

అసలుకు మహిళా కన్‌సెర్నడ్‌ ఆర్ట్‌ ముగ్గు. చిన్నప్పుడు గోడలకు జాజేసి తెల్లటి సున్నంతోని బొమ్మలు వేసినవే బాగా తెలుసు. యిదివరకు దళితుల యిండ్ల ముందు, మాదిగయిండ్లముందు కంటే గోడల మీన్నే అద్భుతమైన ముగ్గుల బొమ్మలే తెలుసు. తర్వాత మాదిగ యింటి ముందు కూడా ముగ్గులు మొదలైనయి. కడుపలు పూదిచ్చుడు, ఎర్రమన్ను అలుకు, దానిమీద గోటిముగ్గు... యిప్పటి అన్ని ముగ్గులు దానిముందు తక్కువే అనిపిస్తది.

రమేష్‌ ఈ ముగ్గు తాత్వికత, దాని సంస్కృతి, ఆ సంస్కృతికి భూమిక వహించే జెండర్‌- స్త్రీ- వాల్లు సృష్టించే ఈ ముగ్గు కళలు బైటి ప్రపంచానికి తన ఫొటోగ్రఫి ద్వారా చెప్పడం చాలా గొప్పగ ఉంది. 'గోడల మీది జాజు చిత్రలిపిని కూడా తీసుకుంటే, ఈ ముగ్గు ప్రధాన చిత్రాల్ని కూడా కలుపుకుంటే బాగుంటుంది.

రమేష్‌ ఆసక్తికి, కళకి, సృజనాత్మకతని అభినందనలు.

-జూపాక సుభద్ర

సంక్రాంతి ముగ్గులు 1

సంక్రాంతి ముగ్గులు 1

మహిళలు సంక్రాంతి ముగ్గులు వేయడానికి ఎంతో ఉత్సుకత ప్రదర్శిస్తారు. అలా ముగ్గులు వేస్తున్న మహిళలను, చిన్నారులను కందుకూరి రమేష్ బాబు తన కెమెరాలో బంధించారు.

సంక్రాంతి ముగ్గులు 2

సంక్రాంతి ముగ్గులు 2

ముగ్గులు వేయడానికి వాడే సుద్దతో పాటు రంగులను ఈ చిత్రంలో చూడవచ్చు. ఇదో చిత్రలిపి. దీంట్లోనే అంతరార్థాలను వెలికి తీయడానికి ప్రముఖ పరిశోధకురాలు రావి ప్రేమలత వంటివారు కృషి చేశారు.

సంక్రాంతి ముగ్గులు 3

సంక్రాంతి ముగ్గులు 3

బొటనవేలికి, ఇతర వేళ్లకు మధ్య సుద్దను పట్టుకుని తీరొక్క రీతిలో ముగ్గును మహిళలు పరుచుకుంటూ పోతారు. ఇదే కళాత్మక విద్య

సంక్రాంతి ముగ్గులు 4

సంక్రాంతి ముగ్గులు 4

ఇళ్ల ముంగిళ్లలో ఇలా ముగ్గురు పరిచి, వాటి మీద బోగి పళ్లను, గొబ్బెమలు పెడుతారు. దీంతో ప్రతి ముంగిలీ అందాలను వెదజల్లుతుంది.

సంక్రాంతి ముగ్గులు 5

సంక్రాంతి ముగ్గులు 5

సంక్రాంతి చిత్రలిపి అంటే చిన్నారులకూ మక్కువే. అంత అందంగా ముగ్గులు వేయడానికి వారు కూడా తాపత్రయపడుతుంటారు. వాటిని ఏకదీక్షతో పరిశీలిస్తారు.

సంక్రాంతి ముగ్గులు 6

సంక్రాంతి ముగ్గులు 6

తీర్చిదిద్దన ముగ్గుపై ఇలా భోగీ పళ్లు, పూలుపత్రాలు పెట్టి ఓ కళారూపం ఇస్తారు మహిళలు. చూడ చక్కగా ఉంటుంది.

సంక్రాంతి ముగ్గులు 7

సంక్రాంతి ముగ్గులు 7

చిత్రలిపి అంటే ఇదే.. మహిళలు వేసే ముగ్గులో మర్మం ఉంటుందని భావిస్తారు. ఈ మర్మాలను విప్పి చెప్పేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.

సంక్రాంతి ముగ్గులు 8

సంక్రాంతి ముగ్గులు 8

మహిళలు వేళ్ల సందుల్లోంచి సుద్దను పారిస్తూ తమకు నచ్చిన, తమకు ఇష్టమైన రీతిలో అందమైన ముగ్గులు ముంగిళల్లో పరుస్తారు.

సంక్రాంతి ముగ్గులు 9

సంక్రాంతి ముగ్గులు 9

మహిళలు కడపను పసువు, కుంకుమలతో తీర్చిదిద్దుతారు. దర్వాజల పక్కన, గోడల పక్కన జాజును కళాత్మకంగా అలుకుతారు. ముంగిళల్లో ఇలా ముగ్గులు వేస్తారు.

ఛాయాగ్రాహకుడు ఇతనే..

ఛాయాగ్రాహకుడు ఇతనే..

తెలుగు ముంగిళ్లలపై ముగ్గులను పరిచే క్రమాన్ని తన ఫొటోల ద్వారా వ్యక్తీకరించడానికి కందుకూరి రమేష్ బాబు ప్రయత్నించారు. ముగ్గులు వేయడానికి వచ్చిన ఆధునిక పరికరాలను కూడా తన ప్రదర్శనలో చూపించాడు.

English summary
Government of Andhra Pradesh, Department of Language and Culture & Indian Council for Cultural Relations is presenting ‘Chitralipi’, Samanyashastram Images by Kandukuri Ramesh Babu, from the 11th of January, 2014 to the 14th of January, 2014 at ICCR Art Gallery, Kala Bhavan, Ravindra Bharati, Hyderabad, to showcase photographs on ‘Chitralipi’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X