వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి నిజమే.. తేల్చేసిన నిపుణుల కమిటీ.. చంద్రబాబుకు కష్టాలు షురూనా

|
Google Oneindia TeluguNews

Recommended Video

పోలవరం ప్రాజెక్టులో అవినీతి || Expert Committee Report On Bribery In Polavaram Project || Oneindia

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయా? పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా ? నిపుణుల కమిటీ విచారణలో ఏం తేలింది ? నిపుణుల కమిటీ చేసిన కీలక సూచనలు ఏంటి ? పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు కష్టాలు షురూ అయినట్టేనా? వంటి అంశాలు ప్రస్తుతం ఏపీ లో హాట్ టాపిక్ గా మారాయి.

 జగన్ మెప్పు కోసం , విదిల్చే చిల్లర డబ్బుల కోసం ఇంత నీఛమా .... మార్ఫింగ్ ముఠాకు లోకేష్ వార్నింగ్ జగన్ మెప్పు కోసం , విదిల్చే చిల్లర డబ్బుల కోసం ఇంత నీఛమా .... మార్ఫింగ్ ముఠాకు లోకేష్ వార్నింగ్

పోలవరం పనుల్లో అవినీతి అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ .. ప్రభుత్వానికి నివేదిక అందజేత

పోలవరం పనుల్లో అవినీతి అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ .. ప్రభుత్వానికి నివేదిక అందజేత

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీ సర్కార్‌ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంజనీరింగ్‌ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది . మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌పై విచారణ చేపట్టింది. అలాగే పోలవరం పనుల్లో అవినీతి గురించి అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో నిపుణులు పీటర్, నారాయణ రెడ్డి, సుబ్బరాయశర్మ, సూర్యప్రకాష్‌, ఐఎస్ఎన్ రాజు, బషీర్, ఆదిశేషులు ఉన్నారు. ఈ కమిటీ ప్రాజెక్ట్ పనులు, జరిగిన అక్రమాలపై అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది.

 పోలవరంలో అవినీతి జరిగిందన్న నిపుణుల కమిటీ .. ఒప్పందాల రద్దు, రివర్స్ టెండరింగ్ కు సిఫార్సు

పోలవరంలో అవినీతి జరిగిందన్న నిపుణుల కమిటీ .. ఒప్పందాల రద్దు, రివర్స్ టెండరింగ్ కు సిఫార్సు


పోలవరం హెడ్‌ వర్క్స్‌లో 2005 నుంచి ఇప్పటివరకూ చేసిన పనులపై పోలవరం ప్రాజెక్టులోఅవకతవకలు చోటు చేసుకొన్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. అంతేకాదు ఈ మేరకు గత ప్రభుత్వంచేసుకొన్న ఒప్పందాలను రద్దు చేయాలనిసిఫారసు చేసింది. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడారివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిపుణుల కమిటీప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది .పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ కి వేల కోట్ల రూపాయాలు లబ్ది కలిగేలా చంద్రబాబు సర్కార్ ప్రయత్నించిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కు ముందుగానే డబ్బుల చెల్లింపులపై కూడ నిపుణుల కమిటీ తప్పు బట్టింది.

వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేసిన గత ప్రభుత్వం .. నిబంధనలు ఉల్లంఘన అన్న నిపుణుల కమిటీ

వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేసిన గత ప్రభుత్వం .. నిబంధనలు ఉల్లంఘన అన్న నిపుణుల కమిటీ

ఇక ఇంజినీరింగ్ పనుల్లో ఓ కంపెనీకి వేలకోట్ల రూపాయలు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడింది. కుడి, ఎడమ కాలువల అంచనాలను భారీగా పెంచారని, ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిటీ తేల్చి చెప్పింది. అంచనాల పెంపుతో కాంట్రాక్టర్లకు మేలు జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు సైతం ఉల్లంఘించారంటోంది నిపుణుల కమిటీ.

పనుల్లో అక్రమాలు, అంచనాల పెంపుపై అధ్యయనం జరిపిన కమిటీ.. ప్రభుత్వానికి 42 పేజీలతో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని సమాచారం. మరి కమిటీ రిపోర్ట్‌ను పరిశీలించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.

చంద్రబాబు ఈ ఉపద్రవం నుండి తప్పించుకుంటారా ? జగన్ బాబును బాగా బుక్ చేస్తారా

చంద్రబాబు ఈ ఉపద్రవం నుండి తప్పించుకుంటారా ? జగన్ బాబును బాగా బుక్ చేస్తారా


రివర్స్ టెండరింగ్ కు కూడ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ కు వెళితే ఈ విషయంలోకేంద్ర ఇరిగేషన్ శాఖ అనుమతిని తీసుకోవాల్సి వస్తోందా అనే విషయమై నీటి పారుదల శాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చంద్రబాబుకు కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. మొదటి నుండి చంద్రబాబును టార్గెట్ చేసి పోలవరంలో అవినీతి జరిగిందంటూ ఆరోపించిన జగన్ ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధమయ్యారు . ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ఉపద్రవం నుంచి ఎలా తప్పించుకుంటారో .. జగన్ చంద్రబాబును పోలవరం విషయంలో ఎలా బుక్ చేస్తారో ఆసక్తి రేపుతున్న అంశం.

English summary
Experts Committee concluded that the work done at Polavaram Head Works since 2005 has been manipulated by the TDP government in Polavaram Project. It also recommended the cancellation of previous contracts. Expert Panel has made important suggestions to the Government to reverse tendering of the Pollavaram project.Expert Panel believes that Chandrababu Sarkar is trying to make a profit of crore Rs. to the contractors and this is nothing but corruption .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X