వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు: వ్యక్తి అరెస్ట్, పోలీసుల నిఘా

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. దీనిపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. నిషేధిత పేలుడు పదార్ధాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

పేలుడు పదార్థాల విక్రయాలు చేయడం నేరమన్నారు. బొబ్బిలిలో అక్రమంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్‌ చేసినట్లు చెప్పారు. శుక్రవారం నిర్వహించిన ఈ సోదాల్లో శ్రీనివాసరావు అనే వ్యక్తి నివాసంలో 800 జిలిటెన్ స్టిక్స్, 5 వేల డెటోనేటర్లు లభించాయి.

 Explosives found in a house at Bobbili

సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస రావు అనే వ్యక్తి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి, సోదాలు నిర్వహించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు చేరవేయడానికే శ్రీనివాస రావు వాటిని నిల్వ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

పాచిపెంటకు పంపించడానికి వాటిని నిల్వచేసినట్లు శ్రీనివాస రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బొబ్బిలి ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఎక్కుగా ఉన్నారని అనుమానిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్తుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ పేలుడు పదార్థాలను మావోయిస్టులకు చేరవేయడానికే నిల్వ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీనివాస రావుకు అనుమానం రాకుండా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని భావిస్తున్నారు.

English summary
Police have seized heavy explosive from a house at Bobbili in Vijayanagaram district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X