అక్రమ సంబంధం వివాదం: ఇద్దరిని నరికి చంపాడు, బాపట్లలో సైకో సూదిగాడు
విశాఖపట్నం: అక్రమ సంబంధం వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోగా, మరో వ్యక్తిని గాయపరిచింది. విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుంబ్రిగూడ మండలం లాచేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ గిరిజనుడు ఓ వ్యక్తిని కత్తితో నరికేందుకు వెళ్లాడు.
అది గమనించిన మరో వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని నరికాడు. అక్కడే ఉన్న మరో గ్రామస్థుడు అడ్డుకోగా అతడిపై కూడా దాడి చేశాడు. దాంతో ఇద్దరు మరణించినట్లు సమాచారం. ఇదే ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అతన్ని కింగ్ జార్జి అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు కూడా అందలేదని సమాచారం. ఫిర్యాదు వస్తే హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.
గుంటూరు జిల్లా బాపట్లలో ఇంజెక్షన్ సైకో శనివారంనాడు హల్‌చల్ సృష్టించాడు. ఇంటర్ విద్యార్థి కృష్ణకు ఇంజెక్షన్ గుచ్చేందుకు సైకో యత్నించాడు. స్థానికులు చూడటంతో సైకో బైక్‌పై పరారయ్యాడు. బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న సమయంలో కృష్ణపై సైకో సూదిగాడు దాడి చేశాడు.












Click it and Unblock the Notifications