వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోనూ కంటి వెలుగు.. వచ్చేనెల 10 నుంచే అమలు...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లోనూ కంటి వెలుగు పథకం అమలు కాబోతుంది. వచ్చేనెల 10 నుంచి లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో కంటివెలుగు పథకం ప్రారంభించి .. వైద్య పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కొందరికీ కళ్లద్దాలు ఇవ్వగా .. మరికొందరికీ ఆపరేషన్లు కూడా చేశారు.

eye tests on andhra pradesh.. october 10th start

అక్టోబర్ 10 నుంచి ఏపీలో కంటి వెలుగు ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కీనింగ్ చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ఐదు దశల్లో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తొలి రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటి బేస్ ఆధారంగా కంటి పరీక్షలు చేస్తారు.

జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా కంటి వెలుగు పథకం కొనసాగుతుంది. కలెక్టరర్ల ఆధ్వర్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పథకాన్ని ఆదర్శంగా తీసుకొని .. ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని నిర్వహిస్తున్నారు.

English summary
eye test conducted by ap government. previous telangana govt conduct eye tests. october 10 onwards implementation on ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X