వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ ...ప్రేమికులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్ : తండ్రి పోలీసు కానిస్టేబుల్ ...కొడుకు పోకిరి . తాను చేసే పనులతో చివరికి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు కొడుకు.పోలీసులు అరెస్టు చేసే వరకు కొడుకు ఏం చేశాడో తెలియదు తండ్రికి. ఫేస్ బుక్ ను ఉపయోగించి పోకిరి పనులకు పాల్పడుతున్న శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేసి యువతిని అరెస్టు చేశారు పోలీసులు.ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.కర్నూల్ జిల్లాకు చెందిన శివకుమార్ ఎంబిఏ చదువుతున్నాడు. ఎమ్మిగనూరు కు చెందిన సహా విద్యార్థినితో ప్రేమలో పడ్డారు.

వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే ఆ యువతిని వేధించేందుకు శివకుమార్ ఆ యువతి పేరుతోనే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు.తనతో కలిసి తిరిగిన సమయంలో తన వద్ద ఉన్న అమ్మాయి ఫోటోలను ఈ అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు.ఈ పోటోలను ఆ అమ్మాయి బందువులను పోస్ట్ చేసేవాడు.

facebook lovers in kurnool

దీంతో ఆ అమ్మాయి ఉల్లిందకొండ పోలీసులను ఆశ్రయించారు.సిసిఎస్ పోలీసులకు ఈ కేసును బదిలీ చేశారు ఉల్లిందకొండ పోలీసులు .మాజీ ప్రియుడే నకిలీ పేస్ బుక్ అకౌంట్ తెరిచి వేదిస్తున్నాడని గుర్తించారు పోలీసులు శివకుమార్ ను అరెస్టు చేశాడు.

శివకుమార్ బుద్దిగా చదువుకోకుండా పోకిరి పనులకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ చెప్పాడు. మనస్పర్థలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.అయితే మాజీ ప్రియురాలిపై కక్షతో ఫేస్ బుక్ ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టాడు. అయితే శివకుమార్ తండ్రి మాత్రం ఎపి ఎస్ పి లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.తండ్రి కానిస్టేబుల్ . కాని కొడుకు మాత్రం పోకిరి పనులు చేసి కటకటాలపాలయ్యాడు.

English summary
facebook lovers in kurnool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X