వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శేషాచలం అడవుల్లో కలకలం- టాస్క్ ఫోర్స్, తమిళ స్మగ్లర్ల మధ్య భీకర పోరు.. పలువురికి గాయాలు..

|
Google Oneindia TeluguNews

శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. దీంతో ఎదురుదాడికి దిగిన స్మగ్లర్లు, ఒక కానిస్టేబుల్ ను గాయపరిచారు. ఇద్దరు స్మగ్లర్లు ను పట్టుకోగా, మిగిలిన వారు దుంగలను పడేసి పారిపోయారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో జరిగింది.

దుంగలను లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బొలెరో జీప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జి రవిశంకర్ తెలిపారు. రిజర్వ్ ఎస్సైలు వాసు, లింగాధర్ మూడు రోజులు గా శ్రీనివాస మంగాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా, పక్కా సమాచారం తో స్మగ్లర్లు పై దాడి చేసినట్లు తెలిపారు. తమిళనాడు జవ్వాది మలైకు దిన ప్రభు (30), సురేష్ (32) లను అరెస్ట్ చేశారు.

faceoff bewteen ap task force and tamil red sandal smugglers in seshachalam forest

అరెస్ట్ చేసిన సమయంలో ప్రభు ఒక కానిస్టేబుల్ ను గాయపరిచి నట్లు తెలిపారు. ఇతను 2014లో అటవీశాఖ అధికారులను హత్య చేసిన కేసులో ముద్దాయి అని, సురేష్ కూడా భాకరా పేటలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి శిక్ష అనుభవించిన నేరస్తుడని తెలిపారు.

faceoff bewteen ap task force and tamil red sandal smugglers in seshachalam forest

ఇటీవల కొందరు ఫారెస్ట్ అధికారులు శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్ల సంచారం లేదని పేర్కొన్నారని, అది పూర్తిగా వాస్తవమని ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని టాస్క్ ఫోర్స్ తెలిపింది. డిఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ కరోనాకు భయపడకుండా తమ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.

faceoff bewteen ap task force and tamil red sandal smugglers in seshachalam forest
English summary
andhra pradesh special task force has arrested two red sandal smugglers and seize 40 logs this morning in seshachalam forest after severe faceoff between two groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X