వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల రవి ఆ విషయాలు వద్దనేవారు: పవన్ కళ్యాణ్‌కు గుండుపై వల్లభనేని వంశీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి గుండు కొట్టించారనే ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం స్పందించారు. ఇటీవల ఈ గుండు కొట్టించిన వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. వల్లభనేని వంశీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్‌కు పరిటాల రవి గుండు కొట్టించారనే మాటలన్నీ పచ్చి అబద్దాలు అని ఆయన స్పష్టం చేశారు.

పరిటాల రవీంద్ర కూడా చెప్పారు

పరిటాల రవీంద్ర కూడా చెప్పారు

వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. తనకు తెలిసి పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవీంద్రకు అసలు పరిచయమే లేదని వెల్లడించారు. ఈ ప్రచారంపై అప్పట్లోనే రవన్న కూడా పలుమార్లు స్పందించారని, దానిని ఖండించారని చెప్పారు. అలాంటిది ఏదీ జరగడం లేదని రవన్న చెప్పారని అన్నారు.

వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దనేవారు

వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దనేవారు

ఇలాంటి మాటలను తన పక్కన ఉన్న వాళ్లు ఎవరైనా మాట్లాడితే పరిటాల రవి వారించేవారని వల్లభనేని వంశీ చెప్పారు. అలా మాట్లాడం తప్పు అని వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి అని చెప్పేవారని అన్నారు. పరిచయమే లేనప్పుడు గుండు కొట్టించడమని ప్రచారం జరగడం ఏమిటని వంశీ అభిప్రాయపడ్డారు.

పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

గుండు కొట్టించడంపై చర్చ ఇలా

గుండు కొట్టించడంపై చర్చ ఇలా

కాగా, పరిటాల రవీంద్ర తనకు గుండు కొట్టించారని గతంలో ప్రచారం జరిగిందని, ఈ ప్రచారం ఎవరు చేశారో తనకు తెలుసునని, అది మనసులో పెట్టుకోకుండా తాను 2014లో టీడీపీకీ మద్దతిచ్చానని, ఆ ప్రచారం జరిగే సమయానికి పరిటాల రవి ఎవరో తనకు తెలియదని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.

పవన్ విషయంలో చిన్న లాజిక్ మిస్: మహేష్ కత్తికి వర్మ దిమ్మతిరిగే సూచనపవన్ విషయంలో చిన్న లాజిక్ మిస్: మహేష్ కత్తికి వర్మ దిమ్మతిరిగే సూచన

నిన్న సునీత, నేడు వంశీ

నిన్న సునీత, నేడు వంశీ

దీనిని ఏపీ మంత్రి, పరిటాల రవి సతీమణి పరిటాల సునీత కూడా సమర్థించారు. పవన్‌కు, తన భర్తకు మధ్య పరిచయమే లేదని చెప్పారు. తన భర్త కూడా అలాంటివాడు కాదని ఆమె చెప్పారు. పవన్, పరిటాల సునీతలతో పాటు మరికొందరు కూడా దీనిని ఖండించారు. అదంతా వట్టి ప్రచారమే అన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా చెప్పారు.

English summary
Telugu Desam Party leader and MLA Vallabhaneni Vamsi on Former TDP leader Paritala Ravi gundu to Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X