• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ కొంపముంచినవి ఇవే?: జనం అలా భావించారా!, రోజా మైనస్..

|

నంద్యాల: 'జనం అభివృద్దిని నమ్మారు.. అదుపు తప్పి మాటలు పేలినవాళ్లకు సరైన బుద్ది చెప్పారు'.. నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత చాలామంది టీడీపీ మద్దతుదారుల నుంచి వ్యక్తమైన అభిప్రాయమిది. అయితే ఇది కేవలం అధికార పార్టీ అభిప్రాయమేనా? అంటే కాదనే చెప్పాలి. ఇటు జనం సైతం వైసీపీ శృతిమించిన వ్యాఖ్యలను సహించలేకపోవడం వల్లే తీర్పును ఆ పార్టీకి ప్రతికూలంగా ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.

రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!

ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ చంద్రబాబునే పదేపదే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, మీడియా మేనేజ్ మెంట్‌లో పక్కాగా ఉండే టీడీపీ దాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లడం ఆ పార్టీకి ఎదురైన ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందంటున్నారు. అంతేకాదు, అటు రోజా సైతం మంత్రి అఖిలప్రియపై చేసిన దురుసు వ్యాఖ్యలు.. మొత్తం మహిళలందరిని కించపరిచినట్లుగా ఉండటంతో.. ఆ ఎఫెక్ట్ కూడా వైసీపీ కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది.

అదే జరిగితే అఖిల ఫ్యూచర్ సూపర్: ఆ క్రెడిట్‌తో బూరెల బుట్టలో పడ్డట్లే..అదే జరిగితే అఖిల ఫ్యూచర్ సూపర్: ఆ క్రెడిట్‌తో బూరెల బుట్టలో పడ్డట్లే..

జగన్ ఎందుకలా:

జగన్ ఎందుకలా:

ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీకే ఫేవర్‌గా ఉంటాయని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఓటమిని కప్పి పుచ్చుకునే ధోరణే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చి ఉంటే ఆయన వ్యాఖ్యలు మరోలా ఉండేవి.

నిజానికి నంద్యాల ప్రచారంలో చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జగన్ చేతులు కాల్చుకున్నారనే అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని టీవీ చానెల్స్ లోను ప్రధానంగా హైలైట్ అయ్యాయి. అదే సమయంలో ఆది నారాయణరెడ్డి ఎస్సీలపై చేసిన కామెంట్స్ ను మాత్రం మీడియా పెద్దగా చర్చ చేయలేదు. ఇక్కడే టీడీపీ మీడియా మేనేజ్ మెంట్ పనిచేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంత ఉన్మాదిలా మాట్లాడే జగన్.. ఇక అధికారంలోకి వస్తే ఎంత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తారన్న అనుమానాలను జనంలో కలిగేలా చేయడంలో టీడీపీ సఫలమైంది. అదే ఎన్నికల్లోను పనిచేసిందనేది చాలామంది అభిప్రాయం.

  Nandyal By Polls : Roja Over Pawan"s Decision హత్యా రాజకీయాలు మొదలు అందుకే పవన్ దూరం|Oneindia Telugu
  రోజా తోను నష్టమే:

  రోజా తోను నష్టమే:

  ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు రోజా చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చేవిగా మారుతున్నాయి. నంద్యాల ఉపఎన్నికలో మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

  సంస్కారం, సంప్రదాయం గురించి మాట్లాడుతూ అఖిలప్రియ డ్రెస్సింగ్‌ను రోజా కామెంట్ చేయడం మహిళలకే ఇబ్బందిగా అనిపించింది. సంప్రదాయ మహిళలు చుడీదార్‌లు ధరించరన్న అర్థం స్పురించేలా ఆమె వ్యాఖ్యలు చేశారు.

  దానికి తోడు మిగతా నాయకుల మీద దాడికి దిగినట్లే.. అఖిలప్రియ మీద కూడా రోజా తన దుందుడుకు వైఖరి ప్రదర్శించడం అఖిలప్రియకు మరింత సానుభూతి చేకూరేలా చేసిందనే చెబుతున్నారు. ఆవిధంగా జగన్, రోజా ఇద్దరూ స్వయంకృతాపరాధనతోనే వైసీపీని ముంచారన్న అపవాదు వినిపిస్తోంది.

  జనం అలా భావించారా?:

  జనం అలా భావించారా?:

  నంద్యాల ఉపఎన్నికకు ముందు రూ.1400కోట్ల అభివృద్ది నిధులు కేటాయించడం టీడీపీకి కలిసొచ్చింది. టీడీపీ పాలనకు ఇంకా రెండేళ్ల సమయమే ఉన్నందునా.. ఇప్పుడు గనుక ఆ పార్టీ గెలవకపోతే జరిగే అభివృద్ది కూడా ఆగిపోతుందని వారు బలంగా విశ్వసించినట్లు తెలుస్తోంది.

  అదీగాక, జగన్ పార్టీని ఇప్పుడు గెలిపించడం ద్వారా ప్రత్యేకంగా ఒరిగేదేమి లేదని కూడా నంద్యాల ప్రజలు భావించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ గెలిస్తే టీడీపీ అభివృద్ది పనులు నిలిపివేస్తుంది కాబట్టి.. ఈ రెండేళ్లు కూడా టీడీపీకే అవకాశం ఇవ్వాలని నంద్యాల జనం ఆలోచించినట్లుగా చెబుతున్నారు.

  శిల్పాపై విమర్శలు:

  శిల్పాపై విమర్శలు:

  శిల్పా మోహన్ రెడ్డిపై టీడీపీ ఎక్కుపెట్టిన విమర్శలు కూడా బాగా పనిచేశాయని చెబుతున్నారు. గతంలో శిల్పా ఎమ్మెల్యేగా కొనసాగిన పదేళ్లలో దళితుల పట్ల ఆయన దారుణంగా వ్యవహరించారని టీడీపీ ప్రచారం చేసింది. రౌడీషీట్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో అమాయకులను వేధించారన్న టీడీపీ ప్రచారం ఆ సామాజిక వర్గం ఓట్లను దూరం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయేలా చేస్తున్నాయి.

  నంద్యాలలో జగన్ నిర్వహించిన బహిరంగ సభలోను 'తమ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నాం' అంటూ శిల్పా బ్రదర్స్ ఇద్దరూ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. దీన్నిబట్టి వారు నిజంగానే చాలామందిని వేధించారేమోనన్న అనుమానాలు కలిగాయి. టీడీపీ ప్రచారం కూడా దానికి జత కలవడంతో శిల్పాకు ఆ ఎఫెక్ట్ తప్పలేదంటున్నారు.

  English summary
  These are the facts behind YSRCP lost in Nandyala bypoll. People think TDP is the only party to develop the constituency
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X