వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోపాల్ విషవాయువుకన్నా ఎంతో ప్రమాదం..! విశాఖలో మలమల మాడిపోతున్న పచ్చని చెట్లు..!!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం/హైదరాబాద్ : మానవ తప్పిదాలకు ప్రకృతి విలపిస్తోంది. సస్యశ్యామలంగా స్వచ్చమైన ప్రాణవాయువును అందించే విశాఖ ఇప్పుడు ప్రజల ఆయువును తీస్తోంది. ఇది ముమ్మాటికి మనిషి సృష్టించిన ఉత్పతమనే చర్చ జరుగుతోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్ కారణంగా కనిపిస్తున్న పరిస్థితి భోపాల్ దుర్ఘటనకు మించిన విషాద‌క‌రంగా ఉంది. ఈ గ్యాస్ లీకేజీ కారణంగా ఐదు గ్రామాలలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గ్యాస్ ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలలోని చెట్లు రంగుమారాయి. ఇక ఐదు గ్రామాల్లో కలిసి దాదాపు 50 వేల మందికి పైనే ఉంటారు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.

మనుషుల ఆయువు తీసిని వాయువు..

మనుషుల ఆయువు తీసిని వాయువు..

విశాఖ పట్ణణంలో విషవాయువు వల్ల రెండున్నర వేల మంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ గ్యాస్ ప్రభావం మనుషులపైనే కాకుండా జీవరాశులు, పక్షిసంపద పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. విషవాయువు ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య పదికి పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. విశాఖ‌లో లీకైన గ్యాస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. గ్యాస్ పీల్చ‌గానే వెంట‌నే మెద‌డుపై ప్ర‌భావం చూప‌డంతో ప్ర‌జ‌లు అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారని వైద్యులు నిర్ధారిస్తున్నారు.

 భోపాల్ గ్యాస్ తీవ్రతకన్నా ఎన్నోరెట్టు ఎక్కువ..

భోపాల్ గ్యాస్ తీవ్రతకన్నా ఎన్నోరెట్టు ఎక్కువ..

విషవాయువు పీల్చిన‌ వారికి న‌రాల‌పై తీవ్ర ప్ర‌భావం ఉంటుందని, వెంటనే తీవ్ర త‌ల‌నొప్పి, వాంతులు, వినికిడి లోపం, తీవ్రమైన మాన‌సిక ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఒక్క మనుషుల పైనే కాకుండా విషవాయువు ప్రకృతిపైన కూడా తన ప్రకోపాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. లీకైన గ్యాస్ ప్ర‌భావానికి చెట్ల‌న్నీ మాడిపోయాయి. ఈ విష‌వాయువు పీల్చిన మూగ‌జీవాలు కూడా నుర‌గ‌లు క‌క్కుతూ నేల‌కొరిగాయి. గ్యాస్ ప్రభావం పడిన గ్రామాలలో అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక గ్యాస్ లీక్ కారణంగా ప్రభావితమైన ఐదు గ్రామాలలో పచ్చని చెట్ల రంగు మారింది. దీంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు.

ప్రకృతిపై తీవ్ర ప్రభావం..

ప్రకృతిపై తీవ్ర ప్రభావం..

అంతే కాకుండా ప్రకృతి మనకంటే శక్తివంతమైనది, వీధి కుక్కలు, పిల్లులు మనకంటే​ ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగిన జీవులు. కానీ ఈ ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన వాయువు ప్రభావానికి 5 కిలోమీటర్లలో ప్రకృతి, జంతువులు విలవిల్లాడాయి. పది మంది మనుషులు చనిపోయారు. అనేక మంది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వేలాది మందికి చర్మ సమస్యలు వచ్చాయి. 5 కిలోమీటర్ల మీర ఆక్సిజన్ కలుషితం అయిపోయింది. దీని వల్ల జరిగిన ప్రమాదం భోపాల్ విషవాయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువని వైద్యులు నిర్ధారించడం ఆందోళనకు గురి చేస్తోంది. లీకైన విషపు గాలి పీల్చిన కుక్కలు, పిల్లులు వణుకుతూ నురగలు కక్కుతూ కింద పడి కొట్టుకున్నాయి.

Recommended Video

Vizag Gas Leak : LG Polymers Company Is The Main Culprit Behind Vizag Gas Tragedy
జంతువులు పక్షులు నేలకొరుగుతున్నాయి..

జంతువులు పక్షులు నేలకొరుగుతున్నాయి..

అదికారుల దృష్టంతా విషవాయువు వల్ల స్పృహ కోల్పొయిన వారి మీద కేటాయించారు ఇక జంతువుల గురించి, ప్రకృతి గురించి పట్టించుకునేదెవరు. వాషవాయువు బారిన పడ్డ వారికి వీలయినంత త్వరగా ఆక్సిజన్ అందిస్తేనే బతుకుతారు. యత్రాంగం అంతా ఆ పనిలో నిమఘ్నమయ్యారు. అందుకే ఈ మూగ ప్రాణుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. వేలాదిగా పాడి సంపద విలవిల్లాడింది. ఆవులు, గేదెలు నురగలు కక్కి పడిపోయాయి. విశాఖపట్నం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన వాయువుకు 3-4 కిలోమీటర్ల పరిధిలో చెట్లు పాలిపోయాయి. ఆకులు మాడిపోయాయి. రంగు మారిపోయాయి. లీకైన ఈ గ్యాస్ పేరు 'స్టిరీన్ గ్యాస్' అని అధికారులు పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా మూసివేసిన పరిశ్రమను తిరిగి ప్రారంభించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. దీనిపై లోతైన వచారణ చేపట్టేందుకు ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

English summary
Visakha, which provides pure oxygen, is now lifting people's lives. There is debate that this is a man-made product. The trees in the surrounding areas were colored under the influence of the gas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X