ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి పేరుతో అధికారికి బెదిరింపులు...రూ.కోటిన్నర ఇవ్వాలని డూప్లికేట్ల బెదిరింపు,బంధువే!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ఏలూరు:అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. తాజాగా తాము ఏసీబీ అధికారులం అంటూ ఓ మత్య్స శాఖ అధికారిని కొందరు కేటుగాళ్లు బెదిరించి డబ్బు కోసం డిమాండ్ చేశారు.

అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కుట్రకు సూత్రధారి అధికారి బంధువేనని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...

మత్స్యశాఖ అధికారికి...బెదిరింపులు

మత్స్యశాఖ అధికారికి...బెదిరింపులు

ఏలూరు త్రీ టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం...అమలాపురానికి చెందిన సత్తి పద్మనాభమూర్తి ఏలూరు మత్స్య శాఖ కార్యాలయంలో మూడు సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా మూడేళ్లుగా పని చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఈయనకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ఏసీబీ అధికారినని, విజయవాడ ఎసిబి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. మీరు అక్రమాస్తులు సంపాదించారని మావద్ద ఆధారాలు ఉన్నాయని, మీపై నిఘా వేశామని అతి త్వరలోనే మీపై దాడి చేయనున్నామని అన్నాడు.

 దాడి జరగకూడదంటే...లంచం

దాడి జరగకూడదంటే...లంచం

అలా దాడి జరగకుండా ఉండాలంటే మీపై కేసు లేకుండా చేయాలంటే రూ.1.50 కోట్లు లంచంగా ఇవ్వాలని ఆ వ్యక్తి బెదిరించాడు. ఆ తరువాత వారి ముఠాకు చెందిన వివిధ వ్యక్తులు 15 రోజులపాటు తరచూ ఫోన్‌ చేస్తూ పద్మనాభమూర్తిపై బెదిరింపులు కొనసాగించారు. దీంతో విసిగిపోయిన ఎడి పద్మనాభమూర్తి తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని, అవసరమైతే విచారణ చేసుకోమని వారితో తేల్చిచెప్పేశారు. దీంతో ఆ అపరిచిత వ్యక్తులు రూటు మార్చి పద్మనాభమూర్తితో బేరసారాలకు దిగారు. కనీసం 20 లక్షలు ఇవ్వమని అడిగిన వాళ్లు చివరకు రూ.7 లక్షలు ఇచ్చినా చాలనే స్థితికి వచ్చారు. నిందితులు ఇలా బేరాలు ఆడుతూ అంతకంతకూ బ్రతిమలాడే స్థాయికి రావడంతో ఎడి పద్మనాభమూర్తికి అనుమానం వచ్చింది.

వ్యవహారంపై...అనుమానం

వ్యవహారంపై...అనుమానం

అసలు వీళ్లు ఏసీబీ అధికారులు కాకపోవచ్చని, ఆ పేరుతో ఎవరైనా బెదిరిస్తూ ఉండవచ్చనే అనుమానం కలిగి ఆయన ఈనెల 26న ఎసిబి పేరిట బెదిరింపుల వ్యవహారంపై త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పద్మనాభమూర్తికి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించారు. నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఈ కుట్రకు పాల్పడింది
బాధిత అధికారి పద్మనాభమూర్తి తోడల్లుడి కుమారుడు సత్తి సాయిసూర్యనారాయణ మూర్తి అలియాస్‌ సాయిరామ్‌ అని తెలిసి అటు పోలీసులు ఇటు అధికారి ఆశ్చర్యపోయారు.

బంధువే...సూత్రధారి

బంధువే...సూత్రధారి

సాయిరామ్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అతడి ముగ్గురు స్నేహితులే ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు. బిజినెస్ లో నష్టాలు రావడంతో పెట్టుబడి కోసం డబ్బు అవసరమొచ్చి ఈ విధమైన కుట్రకు తెరతీసారు. తన పెదనాన్న మత్స్య శాఖ ఏడీగా పని చేస్తున్నారని, ఆయన్నుఎసిబి బెదిరిస్తే డబ్బులు వస్తాయని తన స్నేహితులు చెంచెల వాహిని ఉమామహేశ్వరరావు, గుండాబత్తుల మణికంఠ అలియాస్‌ బాబి, చండ్ర రాంబాబు అలియాస్‌ ప్రసాద్‌ కు తెలిపాడు.

 ఫోన్ కాల్స్...పట్టించాయి...

ఫోన్ కాల్స్...పట్టించాయి...

ఆ ప్రకారం ఉమామహేశ్వరరావు తాను ఏసీబీ అధికారినంటూ ఎడిని ఫోన్‌లో బెదిరించగా, మిగతావారు అతనికి సహకరించారు. అయితే బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పద్మనాభమూర్తికి వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ ప్రాంతాల నుంచి వచ్చాయో తెలుసుకుని నిందితులను గుర్తించారు. ఆదివారం నిందితులు మత్స్య శాఖ కార్యాలయం సమీపంలో ఉండగా ముందుగానే సమాచారం అందుకున్న త్రీటౌన్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై పైడిబాబు తమ సిబ్బందితో వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా జైలుకు తరలించారు.

English summary
The police have arrested the duplicate ACB team who threatened the Fishermen's AD in Eluru.The conspiracy was committed by a close relative of the officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X