వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ సినిమా సీన్ రిపీట్: కడపలో సీబీఐ అధికారుల పేరిట మోసాలు... నలుగురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అంటే మోసం చెయ్యటానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారయ్యింది ప్రస్తుతం సమాజంలో పరిస్థితి. మోసం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్లాన్స్ ఇట్టే వస్తాయి. ఒకవేళ అలా ప్లాన్స్ రాకుంటే సినిమాలు మోసం చేసే వారికి బోలెడన్ని ప్లాన్స్ ఇస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. గ్యాంగ్ సినిమా సీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో రిపీట్ అయింది. సీబీఐ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠా అడ్డంగా బుక్ అయ్యింది. సీబీఐ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతూ బాగా డబ్బు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి దారుణ హత్య; శరీర భాగాలు ముక్కలుగా చేసి రోజుకో భాగాన్ని...తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి దారుణ హత్య; శరీర భాగాలు ముక్కలుగా చేసి రోజుకో భాగాన్ని...

కడపలో నకిలీ సీబీఐ ముఠా అరెస్ట్

కడపలో నకిలీ సీబీఐ ముఠా అరెస్ట్


సీబీఐ అధికారుల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టొచ్చు అని భావించిన నలుగురు సభ్యులు సీబీఐ అధికారుల్లా రెడీ అయ్యారు. బాగా డబ్బున్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. అధికారుల్లా నాలుగు మాటలు ప్రాక్టీస్ చేశారు. నవంబర్ 23వ తేదీన ఖాజీపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ను టార్గెట్ చేసిన నకిలీ సి.బి.ఐ ముఠా సభ్యులు ఉదయ్ కుమార్ ను విచారణ పేరుతో కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అతని ఆస్తుల వివరాలు, తదితరాలను అడిగి తెలుసుకుంటూ నిందితుడిని అక్కడక్కడ తిప్పుతూ అతని వద్దనుండి 1.14 లక్షల రూపాయలను దండుకున్నారు. ఇక ఆ తర్వాత ఉదయ్ కుమార్ ను మరుసటి రోజు వదిలిపెట్టారు.

 సీబీఐ పేరుతో డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ పై ఫిర్యాదుతో గుట్టు రట్టు

సీబీఐ పేరుతో డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ పై ఫిర్యాదుతో గుట్టు రట్టు

అయితే తనను తీసుకెళ్లిన వారు నకిలీ సీబీఐ అధికారులని గుర్తించిన ఉదయ్ కుమార్ తాను మోసపోయానని తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి సిబిఐ అధికారులమని చెప్పి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ సీబీఐ సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు కడప జిల్లాకు చెందిన ఇద్దరు, నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరు, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరు గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ కూడా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

 కడపలో గ్యాంగ్ సినిమా సీన్ రిపీట్ చేసిన నలుగురు సభ్యుల గ్యాంగ్

కడపలో గ్యాంగ్ సినిమా సీన్ రిపీట్ చేసిన నలుగురు సభ్యుల గ్యాంగ్


ఈజీ మనీ కోసం వీరు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏలూరులో ఒక వ్యక్తి వద్ద నవీన్ అనే నిందితుడు గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వద్దనుండి 84 వేల నగదును, వారు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. కేటుగాళ్ల వద్ద ఉన్న నకిలీ సిబిఐ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి వెల్లడించారు. గతంలో వీరు ఎక్కడెక్కడ నేరాలు చేశారో బయటపెట్టే పనిలో ఉన్నారు. గ్యాంగ్ సినిమాను మక్కీకి మక్కీ దింపేసిన ఈ గ్యాంగ్ చివరకు అడ్డంగా బుక్కయ్యారు. అందుకే ఇలాంటి నేరగాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త.. ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకండి అంటున్నారు పోలీసులు.

గతంలోనూ హైదరాబాద్ లో నకిలీ సీబీఐ ముఠా అరెస్ట్

గతంలోనూ హైదరాబాద్ లో నకిలీ సీబీఐ ముఠా అరెస్ట్


ఇక ఈ తరహా నేరాలు గతంలో హైదరాబాద్ లో కూడా జరిగాయి. గతంలో హైదరాబాద్లోనూ సిబిఐ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు హైదరాబాద్ నగరంలో సిబిఐ అధికారులు గా చలామణి అవుతూ పలువురిని మోసం చేస్తున్నాయి 19 మంది ముఠాను పట్టుకున్న పోలీసులు పేట్ బ షీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మహిళ సిబిఐ అధికారిలా మిగతా టీమ్ ను నడిపిస్తుందని గుర్తించారు

English summary
A man from Kothuru village in Kadapa district was taken away in a car by fake CBI gang members in the name of interrogation and money was recovered from him. The fake gang arrested as the victim complained to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X