ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్‌: దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/ఆదిలాబాద్: హైదరాబాద్ నగరంలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గోవింద్‌, బాబా వద్ద నుంచి రూ.2 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ కరెన్సీ ముఠాతో తమకు ఏ సంబంధం లేదని, పది శాతం కమిషన్‌కు ఆశ పడి ఒప్పుకున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. బెంగాల్‌ కేంద్రంగా వీరు నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన అమర్‌జిత్‌ సింగ్‌ను సూత్రధారిగా నిర్ధారించిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Fake currency seized in Hyderabad

ఇద్దరి దారుణ హత్య

ఆదిలాబాద్: జిల్లాలోని నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కల్లు దుకాణంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

మృతులు నిర్మల్ పట్టణంలోని గాజులపేటకు చెందిన మేకల నర్సింహులు(52), నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన బాబూరావు(56)గా పోలీసులు గుర్తించారు. డిఎస్పీ మాధవ రెడ్డి, నిర్మల్ పట్టణ సిఐ ప్రశాంత్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
An amount of Rs 2L fake currency was seized by the North Zone Task Force Police in Hyderabad, on Saturday. Apart from seizing the currency, two men were also held by the police. More details in the matter are awaited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X