గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలు కాంపౌండర్...ఇప్పుడు నకిలీ డాక్టర్...కానీ దొంగపెళ్లిళ్లలో మాస్టర్...

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల లీలలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. డాక్టర్ లకు మంచి సంపాదనతో పాటు మంచి హోదా ఉండటంతో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ టైప్ మాయగాళ్ల దృష్టంతా ఈ వైద్య వృత్తిపై పడింది.

ఈ క్రమంలోనే ఓ కేటుగాడు ఏకంగా ఎంబీబీఎస్‌ డాక్టర్ అవతారమెత్తాడు. నకిలీ వైద్యంతో రోగుల సొమ్ము కొల్లగొట్టడమే కాదు పచ్చి అబద్దాలతో పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకొంటూ నిత్య పెళ్లి కొడుకుగా తరిస్తున్నాడు. ఇలా మోసపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఈ బ్లఫ్ మాస్టర్ గుట్టు రట్టయింది.

 మోసానికి బీజం ఇలా...

మోసానికి బీజం ఇలా...

ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని చిన్నమల్లారం గ్రామానికి చెందిన చిలుకూరి వీరాంజనేయులుకు చిన్నప్పడే తల్లిదండ్రులు చనిపోయారు.
అనాధలా పెరిగిన ఇతడు కొంత కాలం ఒంగోలులో కాంపౌండర్‌గా పని చేశాడు. ఆ తరువాత ఏమి ఆలోచించాడో ఏమో తన పేరు రాయవెంటి రమేష్ బాబుగా మార్చుకున్నాడు. అదే పేరుతో ఆధార్‌ కార్డు తీసుకున్నాడు. అందులో 1983లో జన్మించినట్లుగా పేర్కొన్నాడు. ఎంబీబీఎస్‌, డీఏ, పీజీడీసీసీ చదివాననీ, కార్డియాలజిస్టుననీ చెప్పుకుంటూ వైద్యుడి అవతారమెత్తాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో డాక్టర్ రమేష్ బాబు పేరుతో క్లినిక్ ప్రారంభించి జోరుగా వైద్యం చేసేస్తున్నాడు.

 పచ్చి అబద్దాలతో మరో పెళ్లి...

పచ్చి అబద్దాలతో మరో పెళ్లి...

ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో నరసరావుపేట పరిధిలోని జొన్నలగడ్డకు చెందిన ఓ యువతి ఇంటికి తనంతట తానుగా వెళ్లిన ఈ నకిలీ డాక్టర్ మాట్రిమోనీలో మీ ప్రొఫైల్‌ చూశాననీ, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాననీ తెలిపాడు. తాను ఎంబీబీఎస్‌ డాక్టర్ ననీ చెప్పాడు. అయితే నేరుగా డాక్టరే తమ ఇంటికి ఒక్కడే వచ్చి పెళ్లి చేసుకుంటాననడంతో అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

 దీంతో సినీ ఫక్కీలో...

దీంతో సినీ ఫక్కీలో...

దీంతో ఇతడు అమ్మాయి తల్లిదండ్రులను నమ్మించేందుకు సినీ ఫక్కీలో అద్దె తల్లిదండ్రులను తీసుకొచ్చాడు. చీరాల సమీపంలో చేపల చెరువులకు కాపలాగా ఉండే తనకు బంధువులైన చిలుకూరి బ్రహ్మయ్య, అంజలి దేవిలను తీసుకువచ్చి వారే తన తల్లి దండ్రులుగా చెప్పాడు. తన తల్లికి గుండె జబ్బు ఉందని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకుంటున్నానని నమ్మబలికాడు. ఆ విధంగా ఆ యువతి తల్లిదండ్రులను నమ్మించడంతో మార్చి 2న వీరికి వివాహం జరిగింది. అనంతరం ఆమె డాక్టర్ రమేష్ బాబుతో చెరుకుపల్లి వెళ్లింది. అక్కడ వెన్నెల ఆసుపత్రి పేరుతో కార్డియాలజీ అండ్‌ జనరల్‌ వైద్యుడిగా రమేష్ బాబు ఆసుపత్రిని 2016 జూన్‌ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆమె తెలుసుకుంది.

 మోసం ఇలా బయటపడింది...

మోసం ఇలా బయటపడింది...

అయితే డాక్టర్ రమేష్ బాబు దినచర్య గమనించిన నూతన భార్య మరియు బాధితురాలికి అతడిపై అనుమానం వచ్చింది. అతని వద్ద 15కుపైగా సిమ్‌ కార్డులు ఉండటం, ఎప్పటికప్పుడు సిమ్‌లు మార్చి మాట్లాడుతుండటం గమనించింది. అయితే భార్యకు అనుమానం వచ్చినట్లు అర్థంచేసుకున్న ఈ నకిలీ డాక్టర్ మరో కొత్త నాటకానికి తెరలేపాడు. తనకు క్యాన్సర్‌ వచ్చిందని చెప్పి కట్నంగా ఇచ్చిన రూ.8 లక్షలతో పాటు బాధితురాలికి చెందిన 15 సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. అవి అయిపోయాయని ఇంకా డబ్బు తేవాలని వేధించడం ప్రారంభించాడు. అంత డబ్బు ఒక్కసారిగా అయిపోయాయనడంతో అనుమానమొచ్చిన ఆమె ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నావని అడగ్గా ఓ ఆసుపత్రి పేరు చెప్పాడు. ఆమె అక్కడికి వెళ్లి విచారించగా తమ వద్ద రమేష్ బాబు పేరుతో ఎవరూ చికిత్స పొందడం లేదని అక్కడి వైద్యులు బాధితురాలికి చెప్పారు.

 మోసం బైటపడిందని కొట్టాడు...

మోసం బైటపడిందని కొట్టాడు...

భార్య ఇలా ఆసుపత్రికి వెళ్లి తన గురించి విచారించినట్లు తెలుసుకున్న రమేష్ బాబు ఊరఫ్ వీరాంజనేయులు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో తాను మోసపోయిన విషయం గ్రహించిన ఆమె కొద్ది నెలలకే పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత పూర్తి స్థాయిలో విచారించగా వీరాంజనేయులు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

 వరుస పెళ్లిళ్లు...దండుకోవడం...

వరుస పెళ్లిళ్లు...దండుకోవడం...

వీరాంజనేయులు తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు అనేక మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది. గతంలో కారంపూడికి చెందిన జయప్రద అనే యువతిని కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలి దృష్టికి వచ్చింది. వారికి ఒక కుమారుడుగా ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు ముందు ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే వీరిలో ఎవరికీ విడాకులు ఇవ్వలేదని కూడా బాధితురాలు పోలీసులకు తెలిపింది.

మోసం బైటపడినా...మరో పెళ్లికి సిద్ధం....

మోసం బైటపడినా...మరో పెళ్లికి సిద్ధం....

ఇలా తన గుట్టు రట్టయిందని తెలిసిన వీరాంజనేయులు గత నెల 27న చెరుకుపల్లి నుంచి రాత్రికి రాత్రే పరారయ్యాడు. అయితే అలా రాజమండ్రి చేరి నవంబర్‌ 23న రాజమండ్రి పరిధిలోని ఆరేపురంలో మళ్లీ మరో వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లు స్థానికుల ద్వారా బాధితురాలికి తెలిసింది.

 అన్నీ నకిలీవే...అంతా మోసాలే...

అన్నీ నకిలీవే...అంతా మోసాలే...

వీరాంజనేయులు తన ఇంటి పేరును కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా పెట్టుకొని మోసానికి తెర తీశాడు. పాన్‌ కార్డులో రానవోయినగా, సర్టిఫికెట్లలో రాయవెంటిగా, లగ్నపత్రికలో రాయపాటిగా పేర్కొన్నాడు. అంతేకాక ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు బంధువు అనికూడా చెప్పుకున్నాడు. ఇలా వేరు వేరు వూళ్లల్లో ఆస్పత్రులు తెరవడం అక్కడ ఎమ్మెల్యేలతో ఓపెన్ చేయించడం, హడావుడి చెయ్యడం, అక్కడ మహిళల్ని మోసగించడం ఇదే పని. ఇలా వీరాంజనేయులు నకిలీ వైద్యుడని తేలిపోయింది. అయితే మరి రాయవెంటి రమేశ్‌ బాబు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు అతడికి ఎక్కడివో తేలాల్సి ఉంది. ఆ పేరు కలిగిన వ్యక్తి సర్టిఫికెట్లును సంపాదించి నకిలీ వైద్యుడి అవతారం ఎత్తాడా లేక ఇంకేమైనా చేశాడో తెలియాల్సివుంది.

 కులం కూడా అదికాదు..

కులం కూడా అదికాదు..

రమేష్ బాబు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిగా చెప్పుకుంటూ ఇప్పటి వరకు అదే సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ పెళ్లిళ్ల గురించే తనకు తెలిసిందని, తనకు తెలియకుండా ఇంకా ఎన్ని పెళ్లి చేసుకున్నాడోనని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. కార్డియాలజిస్ట్‌ అంటూ ఆసుపత్రిలో ఎకోమిషన్‌పై పరీక్షలు చేయడం, నెట్‌లో చూసి వైద్యం చేస్తుంటాడని ఆమె తెలిపింది. ఆధార్‌ కార్డు ప్రకారం అతని వయసు 34 సంవత్సరాలని, వాస్తవానికి 45 ఏళ్లు ఉండవచ్చని ఆమె వెల్లడించింది.

English summary
Guntur: A woman gave complaint on a 45-year-old fake doctor for making fake marriage profile and cheated her. The victim cheated by him by marrying and he was taking lakhs of rupees from her after claiming to be a MBBS Doctor software professional. This incident happend in guntur district. Chilukuri Veeranjaneyulu met the victim through a matrimonial site, where he had falsely claimed in his profile that he was a Doctor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X