విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వలపు వల వేస్తారు.. లక్షలు గుంజుతారు! 26 మంది యువతులు అరెస్ట్, 36 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ సీజ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: డేటింగ్ సైట్లు ఇటీవల కాలంలో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. వాటిలో చాలా వరకు కూడా మోసపూరితమైనవే కావడం గమనార్హం. యువతకు అందమైన అమ్మాయిలు చూపిస్తూ.. అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి నుంచి డేటింగ్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు.

కోల్‌కతా కేంద్రంగా..

కోల్‌కతా కేంద్రంగా..


కోల్‌కతా కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ డేటింగ్ వ్యహారంపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆ ముఠా నిర్వాహకులు, యువతులను అరెస్ట్ చేశారు. ‘హలో డియర్.. డేటింగ్ చేస్తావా' అంటూ తీయని మాటలతో యువకులను మాయలు పడేస్తారు. ఆ తర్వాత వారి నుంచి భారీ ఎత్తున డబ్బును గుంజుతారని పోలీసులు తేల్చారు.

తియ్యని మాటలతో..

తియ్యని మాటలతో..

విశాఖ సైబర్ క్రై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా కేంద్రంగా ఈ డేటింగ్ ముఠా.. యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని వెబ్ సైట్లను నిర్వహిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత వివరాలు నమోదు చేస్తే.. యువతులు వారికి ఫోన్ చేస్తారు. తియ్యని మాటలతో వారిని బుట్టలో పడేస్తారు.

రూ. లక్షలు చెల్లించిన యువకులు

రూ. లక్షలు చెల్లించిన యువకులు

ఆ తర్వాత ఆ యువతులతో మరోసారి, లేదా మరికొంత సమయం మాట్లాడాలన్నా ఎంతో కొంత మొత్తం చెల్లించాలని చెబుతారు. ఇలాగే ఆ యువతుల మాయలోపడిన విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడు రూ. 18 లక్షలు చెల్లించడం గమనార్హం.

ఇక మరో యువకుడు రూ. 3 లక్షలమేర చెల్లించారు.

26మంది యువతుల అరెస్ట్

26మంది యువతుల అరెస్ట్

డబ్బులు చెల్లించిన తర్వాత ఆ డేటింగ్ సైట్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు యువకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోల్‌కతాకు వెళ్లి లోతుగా దర్యాప్తు జరిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న 26మంది యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సెల్‌ఫోన్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం

సెల్‌ఫోన్లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం

ఆధారాలతో సహా వీరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 36 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్‌లు, ఓ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెబ్ సైట్‌లో సూచించిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఒక్యులిమ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఈ డేటింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని తెలిపారు.

48 బ్యాంకు ఖాతాలు.. లక్షల బ్యాలెన్స్

48 బ్యాంకు ఖాతాలు.. లక్షల బ్యాలెన్స్

కాగా, ఈ డేటింగ్ ముఠా 48 బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుండటం గమనార్హం. ఆయా బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 5 లక్షల నుంచి 6 లక్షల నగదు ఉన్నట్లు తేల్చారు. వందలాది మంది యువకులు వీరి బారిన పడి మోసపోయారని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను కోల్ కతా కోర్టులోనే ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి డేటింగ్ సైట్లు, ఫోన్ కాల్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

English summary
Fake online dating site busted by Vizag police, 26 girls arrested in Kolkata, Phones and laptops seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X