• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూలుతున్న పార్టీ..! కూల్చుతున్న కట్టడాలు..! టీడిపి సౌధం శిధిలం కాక తప్పదా...?

|

అమరావతి/హైదరాబాద్ : 38ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ సౌధం శిధిలావస్థకు చేరుకుంది. పటిష్ట నిర్మాణంగా ముద్రపడిన పార్టీ ఒక్క సారిగా పేక మేడలా కూలిపోవడానికి సిద్దమైపోయింది. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమి పొందడం, పార్టీ నాయకులు పూర్తి నైరాశ్యంలోకి వెళ్లి పోయారు. అంతే కాకుండా ప్రాంతియ పార్టీలతో పాటు జాతీయ పార్టీ ఐన బీజేపితో చంద్రబాబు నాయుడు కావాలని వివాదాలు పెంచుకున్నారు. దాంతో సరిపెట్టుకోకుండా గత ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి బీజేపియేతర కూటమికి పావులు కదిపారు చంద్రబాబు. దీంతో బీజేపి చంద్రబాబు మద్య మరింత దూరం పెరిగిపోయింది.

టీడిపి కి గడ్డు కాలం..! కష్ట కాలంలో పార్టీ మారుతున్న నేతలు..!!

టీడిపి కి గడ్డు కాలం..! కష్ట కాలంలో పార్టీ మారుతున్న నేతలు..!!

ఇక పక్క రాష్ట్రం ఐన తెలంగాణతో కూడా చంద్రబాబు సరైన సంబంధాలు పెట్టుకోలేదు. పదేళ్ల ఉమ్మడి రాజదాని పేరుతో నీళ్లు, నిధులు, నియమకాలు పేరుతో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక సార్లు చంద్రబాబుతో వైరానికి దిగిన సందర్బాలు ఉన్నాయి. ఇటు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో వివాదాలు, కేద్రంలో బీజేపితో అస్సలు పడని సందర్బం నెలకొనండం, ఈ లోపు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం, ఇటు ఏపిలో వైసీపి అనూహ్య విజయాన్ని అందుకోవడం చంద్రబాబును రాజకీయంగా ఒంటిని చేసాయి. అంతే కాకుండా చంద్రబాబుకు మూల స్థంభాలుగా ఉన్న ముఖ్య నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం పార్టీకి మరింత బలహీన పడేందుకు కారణాలయ్యాయి.

  సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన దేవినేని ఉమా
  ఏకాకి ఐన చంద్రబాబు..! అన్ని చోట్లా వివాదాలే..!!

  ఏకాకి ఐన చంద్రబాబు..! అన్ని చోట్లా వివాదాలే..!!

  అందులో చంద్రబాబు విదేశాల్లో ఉన్న తరుణంలో పార్టీ కకావికలం కావడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఇక లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఐదేళ్లు నెట్టుకొచ్చి, అప్పో సొప్పో చేసి కట్టిన భవంతులను అక్రమభవనాల పేరిట వైసిపి ప్రభుత్వం కూల్చి వేస్తామని ప్రకంటించడం టీడిపికి మింగుడు పడని పరిణామంగా మారింది. అదినేత ఊళ్లో లేనప్పుడు అదికారిక నివాసమైన ప్రజావేదిక నిభందనలకు విరుద్దంగా నిర్మించారన్న నెపంతో కూల్చివేస్తామని స్వయంగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ వర్గాలు కలవరానికి గురౌతున్నాయి. నేతలు పార్టీ మారుతూ పార్టీని కూల్చేస్తుంటే, పార్టీ అధినేత నిర్మించిన కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయడం పట్ల టిడీపి శ్రేణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

  అమరావతిలో ప్రభుత్వ భవంతులు..! కూల్చేస్తామంటున్న వైసీపి ప్రభుత్వం..!!

  అమరావతిలో ప్రభుత్వ భవంతులు..! కూల్చేస్తామంటున్న వైసీపి ప్రభుత్వం..!!

  చంద్రబాబు విదేశాల నుండి తిరిగి వచ్చే లోపు పార్టీ నుంచి ముఖ్యనేతలు వెళ్లి పోయి ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ఓడిపోయి నెలరోజులు గడవకముందే నేతలందరూ పార్టీని విడిచి వెళ్లిపోతున్న తీరు కార్యకర్తలకు ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఒకటికి రెండు సార్లు చట్టసభల్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తే పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉండాల్సింది పోయి పార్టీని ఏకాకిని చేయాల్సిన అవసరం ఏంటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అదికారం ఉంటేనే పార్టీలో ఉంటామని చెప్పడం వెనక ప్రజాసేవ చేస్తామని చెప్పడం శుద్ద అబద్దమని నిర్ధారణ అవుతోంది. పార్టీ మారిన టీడిపి రాజ్యసభ సభ్యులకు పార్టీ ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమనే అంశం నిర్ధారణ జరిగినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

  బాబుకు అన్నీ అగ్ని పరిక్షలే..! భవిష్యత్ వ్యూహం ఏంటి..?

  బాబుకు అన్నీ అగ్ని పరిక్షలే..! భవిష్యత్ వ్యూహం ఏంటి..?

  ఇక చంద్రబాబు అదికారిక కార్యక్రమాల కోసం నిర్మించుకున్న ప్రజావేదిక భవంతిని కృష్ణ నది కరకట్టను ఆనుకొని ఉందని, ఈ నిర్మాణంలో ఎన్నో అక్రమాలు జరిగాయని వైసీపి ప్రభుత్వం నిర్ధారిస్తోంది. అందుకు బుదవారం రోజున ప్రజావేదకను కూల్చేస్తామని జగన్ ప్రకటించారు. ఒక్క ప్రజావేదికే కాకుండా తెలుగుదేశం హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలన్ని కూల్చేస్తామని ప్రకటించారు. దీంతో విదేశాల్లో ఉన్న చంద్రబాబు స్వదేశం తిరిగివచ్చే లోపు అటు పార్టీ, ఇటు చంద్రబాబు నిర్మించిన ప్రభుత్వం భవనాలు అన్ని నేలమట్టం అయ్యేలా కనిపిస్తున్నాయి. సంభోబాలు కొత్త కాదనే చంద్రబాబు తాజాగా నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని ఎలా అదిగమిస్తారో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Telugu Desam Party, which has a 38-year history, is in a state of ruins. The party, branded as a solid structure, was once ready to collapse. Getting the party lost in the last general election,the party leaders went into complete despair.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more