వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్..! వాన్‌పిక్ వ్యవహారంలో సెర్బియా పోలీసుల అదుపులో..

|
Google Oneindia TeluguNews

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బెల్‌గ్రేడ్‌లో పోలీసులు నిమ్మ‌గ‌డ్డ‌ను విచారిస్తున్నారు. గ‌తంలోనే వాన్‌పిక్ వ్య‌వ‌హారంలో నిమ్మ‌గ‌డ్డ మీద సీబీఐ కేసులో ఆయ‌న జైలు జీవితం కూడా గ‌డిపా రు. ఇక‌, నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు.

Recommended Video

వై.కా.పా ఓట్ల లెక్కింపు శిక్షణా తరగతులు
పోలీసుల అదుపులో నిమ్మ‌గ‌డ్డ‌...

పోలీసుల అదుపులో నిమ్మ‌గ‌డ్డ‌...

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌గా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో స్ ఆల్ ఖైమాకు చెందిన ప్ర‌తినిధుల ఫిర్యాదుతో నిమ్మ‌గ‌డ్డ‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యా దు చేసింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగు చూసింది. నిమ్మ గ‌డ్డ ప్ర‌సాద్ సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిమ్మ‌గ‌డ్డ‌ను భార‌త్ తీసుకొచ్చేందుకు వైసీపీ ఎంపీలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ మేరకు సెర్బియాతో సం ప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు.

గ‌తంలోనే సీబీఐ కేసులో..

గ‌తంలోనే సీబీఐ కేసులో..

వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వాడ‌రేవు నిజాంప‌ట్నం పోర్ట్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ కోసం అప్ప‌ట్లో నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ప్ర‌మోట్‌గా దాదాపు నాలుగు వేల‌కు పైగా ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. దీనికి సంబంధిం చి ర‌స‌ల్ ల్ ఖైమాతో ఒప్పందం ఉంది. అయితే, వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత ఈ వ్య‌వ‌హారం పైన సీబీఐ అభియోగాలు న‌మోద‌య్యాయి. దీంతో..నిమ్మ‌గ‌డ్డ‌ను విచారించిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. అనేక రోజులు ఆయ‌న జైలులో ఉండాల్సి వ‌చ్చింది. ఇదే వ్య‌వ‌హారంలో వైయ‌స్ ప్ర‌భుత్వంలో ఓడ‌రేవులు..మౌళిక వ‌స‌తుల మంత్రిగా ప‌ని చేసిన మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ సైతం సీబీఐ అభియోగాలు..విచార‌ణ తో జైలు కెళ్లారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నాడు జైలులో ఉన్న స‌మ‌యంలో వీరిద్ద‌రూ సైతం జైలు జీవితం గ‌డిపారు. ఆ త‌రువాత బెయిల్ మీద విడుద‌ల అయ్యారు. ఇక‌, ఇప్పుడు తిరిగి సెర్బియాలో నిమ్మ‌గ‌డ్డ‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

జ‌గ‌న్‌కు స‌న్నిహితుగా...

జ‌గ‌న్‌కు స‌న్నిహితుగా...

నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. సినీ హీరో నాగార్జున‌కు సైతం ఆయ‌న వ్యాపార భాగ‌స్వామి. తాజా ఎన్నిక‌ల్లో నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ వైసీపీ నుండి ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం సైతం జ‌రిగింది. అయితే, ఇప్పుడు సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకోవంటంతో..అక్క‌డ అరెస్ట్ చేయ‌కుండా భార‌త్‌కు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ వైసీపీ ఎంపీలు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసారు. దీని ద్వారా ముందుగా నిమ్మ‌గ‌డ్డ‌ను స్వ‌దేశానికి తీసుకురావాల‌ని కోరారు. దీని పైన విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం చెల‌రేగ‌టానికి అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
Famous Businessman Nimmagadda Prasad in custody of Serbia Police in VANPIC case. Rasal Al Khima lodged complaint against him. YCP trying to get him for India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X