• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్సార్..సౌందర్య..బాలయోగి : హెలికాఫ్టర్లు కుప్పకూలి..విషాదం మిగిల్చి- నేడు సీడీఎస్ వరకూ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకొని దేశం యావత్తు వారి సేవలను గుర్తు చేసుకుంది. ఇదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో అనేక మంది ప్రముఖులు అర్దాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మందికి విషాదం మిగిల్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం హెలికాప్టర్ల ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇదే తరహాలో వైఎస్సార్ మరణం

ఇదే తరహాలో వైఎస్సార్ మరణం

అందులో ఏపీ ముఖ్యమంత్రి హోదా లో చిత్తూరు పర్యటనకు వెళ్తూ..వైఎస్సార్ సైతం హెలికాప్టర్ ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. ఆయన మరణం జీర్ణించుకోలేక పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, తన అందంద..అభినయంతో అందరినీ కట్టి పడేసిన ప్రముఖ నటి సౌందర్య సైతం ఇదే విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఇప్పుడు బిపిన్ రావత్ మరణంతో హెలికాప్టర్ ప్రమాదాల్లో మరిణించిన వారిని మరోసారి ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలోనే...రచ్చబండకు వెళ్తూ

ముఖ్యమంత్రి హోదాలోనే...రచ్చబండకు వెళ్తూ

2009 సెప్టెంబర్ 2న ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బెల్ 430 హెలికాప్టర్ లో ప్రయాణం చేసారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు బేగం పేట నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్తుండగా.. నల్లమలలోని పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ కూలింది. వైఎస్ తో పాటు ఐదుగురు మృతి చెందారు. సెక్యూరిటీ అధికారి వెస్లీ, ఐఏఎస్ అధికారి సుబ్రమణ్యం సైతం మరణించిన వారిలో ఉన్నారు. ఆ మరణం మొత్తంగా తెలుగు రాజకీయాలనే మార్చేసింది. 2002, మార్చి3.. లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించారు.

బాలయోగి...సౌందర్య సౌతం

బాలయోగి...సౌందర్య సౌతం

భీమవరం నుంచి తిరిగివస్తుండగా కువ్వడలంక గ్రామం వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి కొబ్బరి చెట్టును ఢీకొట్టి మీపంలోని చేపల చెరువులో కూలింది. దీంతో..ఉన్నత స్థానంలో ఉన్న మరో తెలుగు ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. 2004 ఏప్రిల్17 ప్రముఖ నటి సౌందర్య మృతి చెందారు. బీజేపీ ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం పక్కన కుప్పకూలింది. సౌందర్య సజీవ దహనమయ్యారు. ఆమె సోదరుడు అమరనాథ్ ప్రాణాలతో బయట పడ్డారు. 2011 లో అరుణాచల్ ప్రదేశ్ సిఎం ధోర్జీ ఖండూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

ఎంతో మంది ప్రముఖులు సైతం

ఎంతో మంది ప్రముఖులు సైతం


ప్రతికూల వాతావరణం కారణంగా లోబో తాండ్ వద్ద కూలింది. సీఎం దోర్జీ ఖండూతో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. 2001, సెప్టెంబర్ 30..కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా..యూపీలోని కాన్పూర్‌కు బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళుతుండగా దుర్ఘటన లో మరణించారు. ఆయన కుమారుడు జ్యోతిరాధిత్య సింధియా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2005 మార్చి31...జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ యూపీలోని సహారన్ పూర్ లో కుప్పకూలింది.

నాడు సంజయ్ గాంధీ నుంచి నేడు రావత్ వరకు

నాడు సంజయ్ గాంధీ నుంచి నేడు రావత్ వరకు

1973 మే31...కాంగ్రెస్ మాజీ ఎంపీ మోహన్ కుమారమంగళం విమానం ప్రమాదాంలో మృతి చెందారు. మృతదేహాలు చెదిరిపోగా, పార్కర్ పెన్, ఆయన ధరించిన వినికిడి యంత్రం సహాయంతో గుర్తించారు. 1980 జూన్23.. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మృతి చెందారు. తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే కూలి స్పాట్ లోనే మృతి చెందారు.

  గులాబీ ప్రభుత్వం వరి ధాన్యం కొనాల్సిందేన్న వైయస్సార్ టీపి || Oneindia Telugu
   భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

  భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

  ఇక, తాజాగా.. 2021 డిసెంబర్8..భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటుగా ఆయన సతీమణి సహా 14 మంది హెలికాప్టర ప్రమాదంలో మృతి చెందారు. తమిళనాడులోని కూనూరు మధ్య హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇలా ఎంతో మంది ప్రముఖులను హెలికాప్టర్ ప్రమాదాల్లో కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు బిపిన్ రావత్ మరణంతో..వీరందరినీ ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు.

  English summary
  Famous personalities who have lost thier lives in air crashes in India. YSR and BAlayogi also died in air crashes in Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X