అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి షాక్: రాజధానిలో అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం అడ్డుకున్న రైతు, ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం వద్ద సీఆర్డీఏ నిర్మిస్తున్న రహదారి పనులను గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

చంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకంచంద్రబాబు-మోడీలపై జైరాం రమేష్ సంచలనం, 2019లో హోదాపై తొలి సంతకం

ఆదివారం అర్ధరాత్రి వెలగపూడి సచివాలయం సీఎం బ్లాకు వెనుక ఉన్న భూమిలో పరిహారం ఇవ్వకుండా సీఆర్డీఏ అధికారులు రహదారి నిర్మిస్తున్నారంటూ గద్దె మీరా ప్రసాద్ అడ్డుకున్నారు.

 ఆయనకు మద్దతుగా రైతులు చేరుకున్నారు

ఆయనకు మద్దతుగా రైతులు చేరుకున్నారు

మీరా ప్రసాద్‌కు మద్దతుగా మరికొంతమంది రైతులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు ఆందోళనలు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను తరలించే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 అన్యాయంగా రోడ్డు నిర్మిస్తున్నారని

అన్యాయంగా రోడ్డు నిర్మిస్తున్నారని

తమ పొలంలో అన్యాయంగా రోడ్డు నిర్మిస్తున్నారని, ఇలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరాప్రసాద్ హెచ్చరించారు. దీంతో పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు తొలగించి పనులు కొనసాగించారు.

సొమ్మసిల్లి పడిపోయారు

సొమ్మసిల్లి పడిపోయారు

కాగా, పోలీసులు వారిని బట్టలు చెరిగేలా కొట్టారని అంటున్నారు. రైతు మీరా ప్రసాద్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తోంది. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు ఎలా వేస్తారని ఆయన నిలదీశారు.

 హైకోర్టు ఉత్తర్వులు

హైకోర్టు ఉత్తర్వులు

తాత్కాలిక సచివాలయం వెనుక సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని సర్వే నెంబర్ 214/ఏలో గద్దె మీరా ప్రసాద్ అనే రైతు భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆస్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి రోడ్డు వేస్తున్నారని అంటున్నారు.

English summary
Farmer arrested for obstructing road near Amaravati secretariat on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X