వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూసేకరణకు రైతు బలి: ఆర్డీవో కార్యాలయంలో గుండెపోటు..

బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.

|
Google Oneindia TeluguNews

పెనుకొండ: పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణ రైతుల ప్రాణాల మీదకు వస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూసేకరణ ద్వారా భూమి కోల్పోతున్న ఓ రైతు.. ఎక్కడ తక్కువ ధర చెల్లిస్తారోనన్న ఆవేదనతో గుండెపోటుకు గురయ్యాడు.

అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఇప్పటికే 600 ఎకరాలు ఇందుకోసం సేకరించగా.. మరో 1400 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

Farmer dies of heart attack for fear of land aquistion

ఈ నేపథ్యంలోనే భూములిచ్చిన రైతులతో అధికారులు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.

భూమికి తక్కువ ధర నిర్ణయిస్తే ఇద్దరు కుమార్తెల వివాహం చేయడం కష్టమవుతుందన్న బాధలో బాలు నాయక్ ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుకు గురయ్యాడు. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించినా.. బాలు నాయక్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

English summary
Balu Nayak, A farmer was died of heart attack during RDO meeting in Penukonda. he felt too much pressure land aquistion, due to this he attacked by heart stroke
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X