వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

33 సీట్లకు 29 స్థానాలు ఇచ్చారు... ఎలాంటీ నష్టం జరగదు... తేల్చేసిన కృష్ణా ,గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేల

|
Google Oneindia TeluguNews

రాజధాని రైతులు ఎలాంటీ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. రైతులతో నేరుగా మాట్లాడతామని వారు స్పష్టం చేశారు. లక్షల కోట్లు పెట్టి ఓకే దగ్గర రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చెందడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు నగరాల అభివృద్దికి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం

కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం

రాజధాని ప్రాంత రైతుల ఆందోళన నేపథ్యంలోనే క్రిష్ణా ,గుంటూరు జిల్లాల ప్రాంతాలకు చెంది అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రెండు జిల్లాల్లో 33 సీట్లకు గాను 29 సీట్లను వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, తప్పకుండా రాజధాని ప్రాంత జిల్లాలు నష్టపోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారని వారు స్పష్టం చేశారు.

ఆర్థిక పరిస్థితే అమరావతి తరలింపుకు కారణం

ఈ నేపథ్యంలోనే మంత్రి పార్థసారధి మాట్లాడుతూ...గ్రాఫిక్ రాజధాని కాకుండా సంపూర్థ అభివృద్ది కోసం ఎలాంటీ ప్రత్యేక అభివృద్ది కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలపై చర్చించినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదని వైసీపీ అభిప్రాయమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాత్కలిక రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు సుమారు 5800 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని ఇంకా లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అన్నారు. అందుకే అమరావతిని తరలిస్తున్నామని అన్నారు.

లక్ష కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టలేము

లక్ష కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టలేము

ఇప్పుడున్న రాష్ట్ర అర్థిక పరిస్థితిలో లక్ష కోట్ల తెచ్చి అభివృద్ది చేస్తే భవిష్యత్‌లో అర్థిక వ్యవస్థకు సమంజం కాదని అన్నారు. తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకొని, మిగతా డబ్బులను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉపయోగిస్తామని చెప్పారు. అయితే తాత్కలికంగా ఎర్పడిన అమరావతి పై కొంతమంది ఆశలు పెట్టుకున్నారని, దీంతో దాని అభిృద్దికి రేపటి క్యాబినెట్‌లో చర్చించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

జీఎన్ రావు కమిటీ నివేదికను అమోదిస్తున్నాము

జీఎన్ రావు కమిటీ నివేదికను అమోదిస్తున్నాము

రాజధాని ఏర్పాటు, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి ఇచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదికను తామంతా సంతోషంగా అమోదిస్తున్నామని చెప్పారు. దీంతో అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ లేదా ఇతర అవరాల కోసం ఉపయోగించుకుంటామని చెప్పారు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే వారి సమస్యలను చర్చించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సబ్ కమిటీ రైతులతో నేరుగా సమావేశం అయి..ఆందోళన చెందుతున్న రైతులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు జిల్లాల నేతలు సమావేశమై భవిష్యత్ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

సమావేశంలో మంత్రి పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మల్లాధి విష్ణుతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో సమావేశం అయ్యారు.

English summary
YCP MLAs have assured that the capital farmers need not worry. They made it clear that they would speak directly with the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X