అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరాతకం:భూమి కోసం హైటెన్షన్ వైర్లు పట్టుకొని,నవ్వుతూ దాష్టీకం..వెన్నెముక ఇలా..

కర్ణాటకకు చెందిన విద్యుత్ శాఖాధికారులు అనంతపురం జిల్లాలో రైతుల పట్ల కిరాతకంగా వ్యవహరించారు. హైటెన్షన్ వైర్లను పట్టుకొని రైతులు వేలాడుతోంటే కర్ణాటక విద్యుత్ శాఖాధికారులు చోద్యం చూశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం:కర్ణాటకకు చెందిన విద్యుత్ శాఖాధికారులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పరిహరం చెల్లించకుండానే తమ భూముల గుండా హైటెన్షన్ విద్యుత్ వైర్లను లాగడంపై అనంతపురం జిల్లాకు చెందిన రైతులు హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు రాష్ట్ర మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి ఆదేశించారు.

కళ్ళెదుటే తమ భూమిని కోల్పోతున్నామే బాధతో తండ్రి కొడుకులు ప్రాణత్యాగానికి సిద్దపడ్డారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని వారు తమ నిరసనను వ్యక్తం చేశారు.

తమకు పరిహరం చెల్లించకుండా హైటెన్షన్ విద్యుత్ వైర్లను లాగకూడదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు.

కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి నుండి పావగడ వరకు కెపిటిసిఎల్ 220 కెవి హైపవర్ విద్యుత్ తీగలను లాగుతున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మెళవాయి గ్రామానికి చెందిన సుబహన్ సాబ్ పొలంలో విద్యత్ టవర్లు నిర్మిస్తున్నారు.

అయితే టవర్ల నిర్మాణానికి సంబంధించి తనకు పరిహరం చెల్లించిన తర్వాతే వైర్లు లాగాలని రైతు సుబహన్ సాబ్ డిమాండ్ చేశారు.

అయితే ఇవేవీ పట్టించుకోకుండా కర్ణాటక రైతులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. విద్యుత్ వైర్లు లాగే ప్రయత్నం చేశారు.అయితే ఆ వైర్లను పట్టకొని వేలాడారు సుబాహన్ , ఆయన కొడుకు.

విద్యుత్ వైర్లు సుమారు 30 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వేలాడదీశారు. అదే ఎత్తులో ఈ వైర్లను పట్టుకొని వారిద్దరూ వేలాడారు.కాని, వారిని కిందికి దించేందుకు ప్రయత్నించలేదు.నవ్వుతూ కర్ణాటక అధికారులు పట్టించుకోలేదు.

తమను కిందకి దించాలని కోరినా పట్టించుకోలేదు. దాదాపుగా 15 నిమిషాలపాటు అలాగే వైర్లు పట్టుకొని వేలాడారు. అయితే గాల్లో వైర్లను పట్టుకొని ఎక్కువ సేపు నిలబడే ఓపిక లేక కిందకు దూకారు.

protest

ఈ ఘటనలో సుబహన్ సాబ్ , ఆయన కొడుకు నబీరసూల్ వరుసగా కిందకు దూకారు. అయితే నబీరసూలు వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో అతడిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి ప్రకటించారు.

English summary
farmers protest against karnataka electricity officers.karnataka electiricy officials in human attitude at madakashira on sunday.andhra pradesh governament serious about this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X