అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్, జగన్‌లా చేయనని హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఉండవల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలింది! ఉండవల్లిలో ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జనసేనాని వ్యాఖ్యల కారణంగా తమ భూముల విలువ పడిపోతోందని వాపోయారు.

Recommended Video

మీ వల్ల నష్టపోతున్నాం: పవన్‌కు రైతుల ఝలక్

చదవండి: ఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీ

పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజధాని కోసం ఎక్కువ మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. భూములు ఇవ్వని రైతులు రెండు శాతమేనని, వారి కోసం పవన్ వచ్చి రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు.

Farmers protest against Pawan Kalyan comments in Undavalli

నేను జగన్‌లా పారిపోను: పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన పవన్ విమర్శలు గుప్పించారు. తనకు పదిమంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే జగన్‌లా అసెంబ్లీ నుంచి పారిపోయే వాడిని కాదన్నారు. పోటీ చేసి ఉంటే అసెంబ్లీని ఆపేసేవాడినన్నారు. ఆయన విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

2014లో పోటీ చేసి ఉంటే బాగుండేదని, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతుగా నిలిచానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలని, పోరాడాలన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేసుకున్నారన్నారు. ఒకవేళ తాను పోటీ చేసి ఉంటే ఒక్క సీటు రాకున్నా తాను అసెంబ్లీ బయట కూర్చొని నిరసన తెలిపేవాడినన్నారు.

చదవండి: రివర్స్: బాబు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాసం ప్లాన్, 'జగన్ ఇక్కడ అడిగిన ప్రశ్నలే టీడీపీ అడిగింది'

తన అనుభవంపై కొందరు నేతలు మాట్లాడుతున్నారని, కానీ ఎవరూ పుట్టగానే రాజకీయాల్లోకి రారని చెప్పారు. కురువృద్ధులుగా పుట్టలేరన్నారు. అనుభవం వస్తుందని, కిందా, మీదా పడతామని, లేస్తాం, అప్పుడు చూపిస్తామన్నారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు.

చదవండి: కేసీఆర్‌తో గొడవలా, కాంగ్రెస్ నయం: బాబు మాట మారింది, మోడీ-పవన్‌పై నిప్పులు

జనసేనకు ఒక శాతం ఓటు బ్యాంక్ ఉందని కేసీఆర్, పది శాతం ఉందని టీడీపీ నేతలుచెబుతున్నారని, మోడీ, ట్రంప్‌లు కూడా పది శాతంతోనే ప్రారంభించారన్నారు. ఒక్క శాతం ఉన్నా.. ఒక్కడున్నా వస్తానని చెప్పారు. బలమైన సంకల్పం ఉంటే గెలుపు వస్తుందన్నారు. మీ అందరికి అనుభవం ఉంది... కానీ పెట్టి పుట్టలేదన్నారు.

చదవండి: ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులారా..: టీడీపీకి మోడీ కౌంటర్ వీడియో!!

అధికారం అంటే కొందరిది కాదని, అందరిదీ అన్నారు. రాజ్యాంగ హక్కుల కోసం జనసేన నిలబడిందన్నారు. ఎవరో ఓట్లు వేస్తారని మాత్రం కాదని చెప్పారు. తన సహనాన్ని, మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దన్నారు. ప్రజలను ఓటు బ్యాంకుగా చూసే విధానం తనకు అసహ్యం కలిగిస్తోందన్నారు. ఉండవల్లి రైతుల సమస్యలపై తాను మాట్లాడటానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పారు. వాళ్లు కూడా తోటి మనుషులేనని, ఆ భావనతోనే వారి సమస్యల గురించి మాట్లాడాను తప్ప, ఓట్ల కోసం కాదన్నారు.

English summary
Farmers protest against Jana Sena chief Pawan Kalyan comments in Undavalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X