వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కన్నాను నిలదీసిన రైతులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తోన్న హెటెక్స్ ప్రాంగణంలో మంత్రి కన్నా లక్ష్మినారాయణను రైతులు నిలదీశారు . సదస్సుకు హాజరుకావాలంటే రైతుల నుంచి ప్రవేశ రుసుము అడుగుతున్నారని కొందరు రైతులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. తాము రుసుము చెల్లించలేమని వారు తేల్చిచెప్పారు. ఎంట్రీ ఫీజు ఉంటే తమను ఎందుకు ఆహ్వానించారని వారు మంత్రిని నిలదీశారు .

అయితే, ఈ సదస్సును ప్రభుత్వం నిర్వహించడం లేదని, సదస్సుకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని మంత్రి చెప్పారు. ఒక ఎన్జీవో సంస్థ ఈ సదస్సును నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాల నుంచి ఎంపిక చేసిన యాబై మంది రైతులకు మాత్రమే ప్రభుత్వం ఎంట్రీ ఫీజు చెల్లిస్తుందని ఆయన చెప్పారు. కాగా సదస్సు రేపటి నుండి 7వ తేదీ వరకు జరగనుంది.

సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల క్రితం నుంచే సన్నాహాలు చేస్తూ వచ్చింది. అయితే, ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సదస్సుకు 350 మంది విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పారు. కానీ వారి సంఖ్య 33కు మాత్రమే పరిమితమైంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, బిల్‌గేట్స్ సదస్సుకు వస్తారని నిర్వాహకులు చెప్పారు. కానీ వారెవరూ రాలేదు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కార్యక్రమాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కన్నాను నిలదీసిన రైతులు

కన్నాను నిలదీసిన రైతులు

ప్రపంచ వ్యవసాయ సదస్సు సందర్భంగా రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణను నిలదీశారు. వారు ఆందోళనకు దిగారు.

రుసుం ఇచ్చేది లేదు..

రుసుం ఇచ్చేది లేదు..

సదస్సుకు ఆహ్వానించి రుసుం వసూలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రుసుం చెల్లించలేమని వారు మంత్రి కన్నాతో చెప్పారు.

కన్నా ఇలా..

కన్నా ఇలా..

అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఇలా కనిపించారు.

ఎందుకు పిలిచారు...

ఎందుకు పిలిచారు...

ఎంట్రీ ఫీజు ఉంటే తమను ఎందుకు ఆహ్వానించారని రైతులు మంత్రి కన్నా లక్ష్మినారాయణను ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని మంత్రి చెప్పే ప్రయత్నం చేశారు.

విదేశీ ప్రతినిధులు అంతంత మాత్రమే..

విదేశీ ప్రతినిధులు అంతంత మాత్రమే..

ప్రపంచ వ్యవసాయ సదస్సుకు 350 మంది దాకా విదేశీ ప్రతినిధులు వస్తారని ఆశించగా, చాలా తక్కువ మంది వచ్చారు. 33 మంది విదేశీ ప్రతినిధులకే పరిమితమైంది.

సదస్సు వద్ద ఇలా..

సదస్సు వద్ద ఇలా..

సదస్సు ప్రాంగణం వద్ద ఇలా వాతావరణం కనిపించింది. దేశవిదేశీ వాతావరణం, సంప్రదాయం అక్కడ కనిపించింది.

ప్రదర్శన ఇలా..

ప్రదర్శన ఇలా..

ప్రపంచ వ్యవసాయ సదస్సు సందర్భంగా ఓ ప్రదర్శన కూడా నిర్వహించారు. ప్రదర్శన ఇలా కనిపించింది.

English summary
Farmers invited to international agriculture seminar at hitex in Hyderabad qustioned agriculture minister Kanna Lakshminarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X