పెద్ద కూతురిని కత్తితో బెదిరించి, తండ్రి అత్యాచారం
కర్నూలు: ఓ కన్న తండ్రి తన కూతురి పైనే అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో ఆదివారం నాడు వెలుగు చూసింది. ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్త నిత్యం తాగి వచ్చి భార్య, పిల్లలను వేధించేవాడు. రోజు కల్లు తాగేందుకు అతనికి యాభై రూపాయలు ఇవ్వకుంటే కుటుంబ సభ్యుల పైన విరుచుకుపడతాడు.
భార్య కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. ఆమె కుమార్తెల్లో ఒకరు పదో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత కొద్ది రోజులుగా భర్త పెద్ద కూతురిని వేధింపులకు గురి చేస్తుండటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతనిని హెచ్చరించారు.
అయితే, అతని బుద్ధి మాత్రం మారలేదు. శనివారం ఆమె కూలీ పనులకు వెళ్లింది. ఇదే అదనుగు చిన్న కుమార్తెను ఇంటి నుండి బయటకు పంపిన భర్త పెద్ద కుమార్తెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని ఆ పెద్ద కూతురు ఆదివారం తల్లికి వివరించింది. దీంతో ఆ తల్లి కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ, పోస్కో చట్టాల కింద నిందితుడి పైన కేసు నమోదు చేశారు.

స్కూల్‌కు రాలేదని బయట నిల్చోబెట్టారు
నంద్యాలలో నందన్ కుమార్ అనే పదో తరగతి విద్యార్థి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు. పాఠశాలకు రానందుకు కరస్పాండెంట్ అవమానించడంతో భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు నందన్ కుమార్‌కు ఈనెల 24న తీవ్రంగా జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు.
నందన్ కుమార్ మరుసటి రోజు మంగళవారంపాఠశాలకు వచ్చాడు. అయితే కరస్పాండెంట్ విద్యార్థిని దుర్భాషలాడుతూ సోమవారం పాఠశాలలో లేనందుకు పీరియడ్‌కు రూ.200 చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా విద్యార్థిని పాఠశాల బయట నిలబెట్టి అవమానించారు.
తల్లిదండ్రులు వచ్చి అడిగారు. జ్వరం వచ్చినా, పాఠశాలకు రాకున్నా ఫైన్ కట్టాల్సిందేనని కరస్పాండెంట్ చెప్పారు. నందన్ కుమార్‌కు టీసీ ఇచ్చి పంపుతానని, టీసీలో బ్యాడ్ కాండక్ట్ రాస్తానని కరస్పాండెంట్ చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.
డిప్యూటీ డీఈవో, ఎంఈవో రెండు రోజుల క్రితం కరస్పాండెంట్‌తో చర్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నందన్ కుమార్ ఆదివారం విషపూరిత ద్రావణం తాగాడు. దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications