వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాతిమా మెడికల్ కాలేజీ సమస్య మళ్లీ మొదటికే: పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఫాతిమా విద్యార్థుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ఫాతిమా స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులతో సమావేశమైన వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సమస్య పరిష్కారం కోసం వారి ముందు పలు ఆప్షన్లు ఉంచారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు తాను సూచించిన ఆప్షన్లలో ఒక ప్రతిపాదనకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని ఆయనే చెప్పుకొచ్చారు.

మంత్రి గారి మాటలను బట్టి చూస్తే ఫాతిమా విద్యార్థులందరి సమస్య కాకపోయినా కొంతమందిదైనా పరిష్కారం అవుతుందని భావించారు. అయితే వాస్తవం అందుకు భిన్నంగా ఉందని ఆ తరువాత పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇవి.....

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ లో వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తో సమావేశమైన ఫాతిమా విద్యార్థులు ఆ సమావేశం సందర్భంగా మంత్రి తమ ముందుంచిన ఆప్షన్లు చూసి మౌనం వహించారు. అక్కడికక్కడే ఏమీ మాట్లాడలేదు.

దీంతో మౌనం అర్థాంగీకారం అనుకున్నారో...లేక తాము సూచించిన ఆప్షన్లను ఫాలో అవడం తప్ప వారు చెయ్యగలిగేదేముందని ఆలోచించారో తెలియదు కాదు కాని ఆ మీటింగ్ అనంతరం మాట్లాడుతూ విద్యార్ధుల ముందు తాను ఉంచిన పలు ఆప్షన్లలో ఒకదానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి కామినేని తమ ముందుంచిన ప్రతిపాదనలపై తమ అభిప్రాయం ఏమిటో ఫాతిమా విద్యార్థులు నేరుగా పవన్ కళ్యాణ్ తోనే చెప్పారు.

 ఎపి ప్రతిపాదనలు ఇవి..

ఎపి ప్రతిపాదనలు ఇవి..

  • రాబోయే విద్యాసంవత్సరానికి విద్యార్ధులు నీట్ పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీట్ కోచింగ్ ఉచితంగా ఇప్పిస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్ధులకు విజయవాడలోని పోరంకి లో ఉన్న నారాయణ కాలేజ్ క్యాంపస్ లో ప్రత్యేకంగా వీరికి స్పెషల్ గా కోచింగ్ సోమవారం నుండి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
  • ఎవరైతే విద్యార్ధులు తమకు మెడికల్ సీటు వద్దు అనుకొంటారో వారికి ఫాతిమా యాజమాన్యం నుండి ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తుందన్నారు.
  • ఈ నెల 14న ఫాతిమా యాజమాన్యంతో తల్లిదండ్రుల సమక్షంలో సమావేశమై సమస్య పరిష్కారాలపై చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు.
  •  తదనంతర పరిణామాలు....

    తదనంతర పరిణామాలు....

    అయితే మంత్రి కామినేని వివిధ ఆప్షన్లను తమ ముందు ఉంచినపుడు ఏ కారణంతో మౌనం వహించారో తెలియదు కాని ఆ తరువాత కొంత సమయం వ్యవధిలోనే ఒకానొక కీలక సందర్భంలో తమ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేసేశారు. అంతే కాదు మంత్రి కామినేని ఏ ఆప్షన్ అయితే ఎక్కువమంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నట్లు మీడియాతో చెప్పారో ఆ ఆప్షన్ నే తాము వ్యతిరేకిస్తున్నట్లు ఫాతిమా విద్యార్థులు కుండబద్దలు కొట్టారు.

     ఎక్కడ చెప్పారు...ఎవరితో చెప్పారు....

    ఎక్కడ చెప్పారు...ఎవరితో చెప్పారు....

    మంత్రి కామినేని తమ ముందుంచిన ఆప్షన్లు తమకు ఏమాత్రం నచ్చలేదనే విషయం స్పష్టం చేసేందుకు విద్యార్ధులు ఒక కీలకమైన వ్యక్తిని, ప్రాధాన్యత గలిగిన సందర్భాన్ని ఎంచుకున్నారు. ఫాతిమా విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకుంది మరెవరితోనో కాదు...ప్రశ్నించడానికే బయలు దేరిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తో... ఆ సందర్భం కూడా సమస్యలు ఉన్న వారందరూ బారులు తీరి పవన్ కు తమ సమస్యలు విన్నవించుకుంటున్న వేదిక...హోటల్ ఫార్ట్యూన్ మురళిలో...పవన్ ను కలిసిన ఫాతిమా విద్యార్థులు మంత్రి కామినేని తమ ముందుంచిన ప్రతిపాదనలు వినిపించి వాటి పట్ల తమ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పారు.

    పవన్ తో విద్యార్థులు...

    పవన్ తో విద్యార్థులు...

    పవన్ కళ్యాణ్తో ఫాతిమా విద్యార్థులు మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం తమ పట్ల ఘోరంగా వ్యవహరిస్తున్నదని ఫిర్యాదు చేశారు. మంత్రి తమ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారని వాటిలో నారాయణ కాలేజీలో నీట్ కోచింగ్ తీసుకోవడం ఒకటని చెప్పారు. ప్రభుత్వం తమకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామనీ చెబుతోందని, క్వాలిఫై అయితే ఏదో మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామనీ అంటోందని విద్యార్థులు పవన్ కు వివరించారు. అయితే కోచింగ్ తీసుకొని తాము క్వాలిఫై కాకపోతే తమ గతేమిటని వారు ప్రశ్నించారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తప్పు చేసిన ఫాతిమా కాలేజీ యాజమాన్యాన్ని వదిలేసి తమను శిక్షించడమేమిటని తీవ్రంగా ప్రశ్నించారు. తమకు న్యాయం చెయ్యగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మీ మీదే తమ ఆశ పెట్టుకున్నట్లు విద్యార్థులు ఈ సందర్భంగా పవన్ తో చెప్పారు.

     పవన్ జవాబు...

    పవన్ జవాబు...

    విద్యార్థులు తమ ఆవేదనను వెల్లడిచేయడంతో చలించిపోయిన పవన్ వారికి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
    ఫాతిమా కాలేజి వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే అన్నారు. ఫాతిమా
    కాలేజి యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అలాగే విద్యార్థుల సమస్య పరిష్కారానికి మంత్రి కామినేని, హెల్త్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

    అండగా ఉంటా...మళ్లీ కాలేజ్ కు వెళతారు...

    అండగా ఉంటా...మళ్లీ కాలేజ్ కు వెళతారు...

    అంతే కాదు ఈ సందర్భంగా పవన్ ఫాతిమా విద్యార్థులకు వరం లాంటి భరోసా ఇచ్చారు. మీకు పూర్తి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని,
    మీరంతా మళ్లీ కాలేజికు వెళ్తారని పవన్ ఇచ్చిన హామీతో విద్యార్థులు ఆనందాశ్చర్యాలకు లోనై పవన్ కు హర్షాతిరేకాలతో తమ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తమ సమస్య పరిష్కారం కోసం ఫాతిమా విద్యార్థులు చూపినంత తెగువ

    వైసీపీ టీడీపీ చూపించి ఉంటే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరి వచ్చేదని కీలకమైన వ్యాఖ్య చేశారు.

    మళ్లీ మొదటికి...

    మళ్లీ మొదటికి...

    ఫాతిమా సమస్య పరిష్కారానికి తాము చూపిన ఆప్షన్లకు ఎక్కువ మంది విద్యార్థులు అంగీకరించారని, దీంతో సమస్య చాలా వరకు సమసిపోయినట్లేననే విధంగా మంత్రి కామినేని ప్రకటించి రోజైనా గడవక ముందే విద్యార్థులు ఏకంగా ఎపి ప్రభుత్వ తీరు పైనే పవన్ కు ఫిర్యాదు చేయడంతో ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అయితే పవన్ కళ్యాణ్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.

English summary
Vijayawada: As actor-politician Pawan Kalyan took the stage at the Fortune Murali Park Hotel in Vijayawada on Friday under the banner of his party. A group of students and parents from FIMS had arrived early at the venue, We have given up all our hard-earned money just so that our children could get a better future. However, the college and the state are now playing with our lives. You are our last hope, a parent told Pawan Kalyan.After hearing the students and parents, Pawan Kalyan lashed out at the BJP and the TDP. He also assured them that he would try to get some action done within a week. We will make sure that you go to college soon, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X