వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కార్యాలయమంటే పాములకు ఇష్టం...కాని ఉద్యోగులు ఏం చేశారో తెలుసా

By Narsimha
|
Google Oneindia TeluguNews

గురజాల : ఎక్సైజ్ శాఖలో పనిచేసేందుకు ెవరైనా ఉత్సాహం చూపుతారు. కాని గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మాత్రం తాము పనిచేయబోమని చెబుుతున్నారు. తమను బదిలీ చేయాలని కోరుతున్నారు. ఇతర శాఖల నుండి ఎక్సైజ్ శాఖకు బదిలీలుచేస్తే ఎగిరి గంతేసే వారుంటారు. కాని, ఎక్సైజ్ శాఖ నుండి తమను బదిలీ చేయాలని కోరుతున్నారు. లేదా తాము పనిచేస్తోన్న చోటు నుండి మరో ప్రాంతానికైనా తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పట్టుబడిన అక్రమ మద్యం, నాటుసారాయి ఉంటాయి. లేదా అక్రమమద్యాన్ని సరఫరాచేసే వాహానాలు కూడ చూస్తుంటాం. కాని, గుంటూరు జిల్లా గురజాల ఎక్సైజ్ కార్యాలయంలో ఇందుకు విరుద్దంగా సాగుతోంది. విషసర్పాలు కార్యాలయంలో ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి. పాముల భయంతో ఉద్యోగులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడుపుతున్నారు.

fear of snakes in excise office

గురజాల ఎక్సైజ్ కార్యాలయంలో రాత్రిపూటే కాదు పట్టపగలు కూడ పాములు యధేచ్చగా తిరుగుతాయి. ఈ పాముల భయంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు.ఎప్పుడూ పై కప్పు నుండి పాములు కిందపడుతాయో...ఏ మూల నుండి ఏ పాము వస్తోందోనని ఉద్యోగులు భయంతో పనిచేస్తుంటారు.

గురజాల నుండి తమను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరుతన్నారు. లేదా తమను ఇతర శాఖలకైనా కొంత కాలంపాటు డిప్యూటేషన్ పై బదిలీ చేయాలని కోరుతున్నారు.వాంర రోజుల వ్యవధిలోనే మూడు పాములను పట్టుకొన్నారు. వర్షాకాలం ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.పాత సారాయి గోడౌనులో ఈ కార్యాలయాన్ని నడుపుతున్నారు దీని పక్కనే చెట్లు, పొదలు ఉంటాయి. దీని వల్లే పాములు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

English summary
an excise employees fear from snakes in gurajala.this office in the premises of an old gowdowhn. around this godown bushes, trees.an everyday number of snakes come to the office.employee fear for snakes. employees appeal to higher officer to shift this office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X