• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kathi Mahesh కొత్త బాంబు..దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం: బీజేపీతో వేగలేం

|

అమరావతి: దళిత నాయకుడు, సెలెబ్రిటీ కత్తి మహేష్.. బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షతను ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక కేటాయింపుల్లో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. దీన్ని దీర్ఘకాలికం చేసే కుట్రకు కూడా బీజేపీ ప్రభుత్వం తెర తీసిందని మండిపడ్డారు. ఢిల్లీలో మలయాళీ భాషను మాట్లాడకూడదంటూ జారీ అయిన ఉత్తర్వులను కూడా ఆయన తప్పుపట్టారు.

పెళ్లికి గంట ముందు టీకా: హైదరాబాద్ మెగా వ్యాక్సినేషన్‌లో వధువు: పట్టు వస్త్రాల్లో ప్రత్యక్షంపెళ్లికి గంట ముందు టీకా: హైదరాబాద్ మెగా వ్యాక్సినేషన్‌లో వధువు: పట్టు వస్త్రాల్లో ప్రత్యక్షం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కావాలంటూ..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కావాలంటూ..

దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిపి ప్రత్యేకంగా United States of South Indiaను ప్రకటించాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు. దీని అవసరం ఎలాంటిదో వివరిస్తూ.. తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షత చూపిస్తూనే ఉందని చెప్పుకొచ్చారు. ఆర్ధిక కేటాయింపులతో పాటు, రాజకీయ భాగస్వామ్యం సహా అన్నింట్లోనూ వివక్షను కొనసాగిస్తోందని, దీన్ని శాశ్వతంగా, సుస్థిరం చేయాలనే దీర్ఘకాలిక కుట్రకు కేంద్రం పూనుకుంటోందని అన్నారు.

2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు

2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు

2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు చేయాలనే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కత్తి మహేష్ ఆరోపించారు. ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ప్రకారమే అన్ని రాష్ట్రాలకూ ఆర్ధిక కేటాయింపులు ఉంటోన్నాయని చెప్పారు. కుటుంబ నియంత్రణను తప్పకుండా పాటించి జనాభాను తగ్గించుకున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది శాపంగా మారే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆర్థిక కేటాయింపులు జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నష్టపోతాయని ఆయన పరోక్షంగా చెప్పారు. పన్నులు ఎక్కువగా కట్టే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలకు ఆర్ధిక కేటాయింపులు అధికంగా వెళితే మిగిలేది చిల్ల పెంకులేనని అన్నారు.

 పార్లమెంటరీ సీట్ల సంఖ్య కూడా మార్చే ప్రతిపాదనలు..

పార్లమెంటరీ సీట్ల సంఖ్య కూడా మార్చే ప్రతిపాదనలు..

ఇదే జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ సీట్ల సంఖ్యను కూడా మార్చే ప్రతిపాదనలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయని అన్నారు. అదే జరిగితే- ఉత్తరప్రదేశ్‌లో ఎవరికి ఎక్కువ సీట్లు కేంద్రంలో అధికారం వాళ్లదే అనేది మరింత సార్ధకమౌతుందని బలపడుతుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ సీట్లను, రాజకీయ ప్రాబల్యాన్ని, బలాన్ని కోల్పోతాయనే ఆందోళనను కత్తి మహేష్ వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి వస్తే- కాస్తోకూస్తో ఎంపీల సంఖ్యాబలంతో నెట్టుకొస్తున్న దక్షిణాది రాష్టాలు ఇకపై ఏమీ చేయలేని పరిస్థితికి వస్తాయని అన్నారు.

భాషా సంస్కృతిపైనా దాడి..

భాషా సంస్కృతిపైనా దాడి..

హిందీ మాట్లాడే వారు దక్షిణాది రాష్ట్రాల భాషలపై సంస్కృతికపరమైన దాడి చేస్తోన్నారని కత్తి మహేష్ చెప్పారు. ఇక ఆధిపత్య ధోరణి సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదని అన్నారు. హిందీ జాతీయ భాష అనే భ్రమలో ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయని, అన్ని భాషాలూ రాజ్యాంగంలో సమానమే అనే ముక్క అక్కడి వారికి తలకెక్కదని వ్యాఖ్యానించారు. తమ మాటే నెగ్గాలనే మూర్ఖత్వాన్ని ఉత్తరాది రాష్ట్రాల వారు పట్టుపడుతూ ఉంటారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణలు, పెరుగుతున్న నేరాలకు ఉత్తరాది రాష్ట్రాల వారే కారణమని విమర్శించారు. దీనిపై ఏ దక్షిణాది మెట్రో సిటీకి వెళ్లినా కథలు కథలుగా చెప్తారని కత్తి మహేష్ అన్నారు.

నష్టమే తప్ప..

నష్టమే తప్ప..

ఉత్తరాదితో కలిసి ఉండటం వల్ల నష్టం తప్ప ఏ మాత్రం లాభం లేదని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. దక్షణాది పట్ల వీళ్ళ దృక్కోణం, వివక్ష ఎప్పటికీ మారబోవని తేల్చి చెప్పారు. కాలం గడిచే కొద్దీ ఇంకా విషపూరితంగానే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. ఆయా కారణాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు United States of South India డిమాండ్‌పై ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మలయాళీ నర్సులు మలయాళంలో మాట్లాడకూడదంటోన్నారని, తమకు ప్రత్యేకంగా దక్షిణాది దేశాన్ని ఇచ్చేస్తే ముచ్చటగా నాలుగు భాషలూ మాట్లాడుకుంటూ బ్రతికేస్తామని అన్నారు.

  South నుండి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన లెజెండ్స్ వీరే ! || Oneindia Telugu
  English summary
  Fed up with BJP divide and rule policy, actor Kathi Mahesh demands for United States of South India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X