వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అలాంటి కాలేజీలకు ఇక తాళమే.. నో ట్యూషన్‌ ఫీజ్‌కు జగన్ సర్కార్ సిఫారసు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీల పైన కఠిన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి. కనీస ప్రమాణాలు..ఫీజుల విషయంలో కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని కాలేజీలకు చెక్‌ పెట్టాలని, అవసరమైతే ఫీజును తగ్గించడం లేదా అసలు ఫీజు లేకుండా సిఫారసు చేయాలన్న యోచనలో ఉన్నత విద్య నియం త్రణ కమిషన్‌ కూడా ఉన్నట్లు తెలు స్తోంది.

రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పాటించని కాలేజీలను ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశాలపైన ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత సిఫార్సులు...నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

నో ఫీ జాబితాలో 50 కాలేజీలు..

నో ఫీ జాబితాలో 50 కాలేజీలు..

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలు పాటించకుండా, కనీస ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసులు చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా.. వీటిలో దాదాపు 50 కళాశాలలకు 2019-20 నుంచి 2021-22 విద్యా సంవత్సరాలకు ట్యూషన్‌ ఫీజును సిఫారసు చేయకుండా నో ఫీ జాబితాలో పెట్టే విధంగా సిఫార్సులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆ 50 ఇంజనీరింగ్‌ కళాశాలల అఫిలియేషన్‌ రద్దుచేసేలా విశ్వవిద్యాలయాలకు సిఫారసు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లుతా తెలుస్తోంది.

కనీస ఫీజు రూ 35 వేలు తగ్గించే ఛాన్స్..

కనీస ఫీజు రూ 35 వేలు తగ్గించే ఛాన్స్..

ఏపీలో ఉన్న కాలేజీల్లో.. వాస్తవిక ఆదాయ-వ్యయాలు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త ట్యూషన్‌ ఫీజులను సిఫారసు చేయాలని కమిషన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని కాలేజీలను అదుపు చేసే విధంగా.. అవసరమైతే ఫీజును తగ్గించడం లేదా అసలు ఫీజు లేకుండా సిఫారసు చేయాలన్న యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పాటించని కాలేజీలను ఏ మాత్రం ఉపేక్షించరాదని కమిషన్‌ భావిస్తోంది.

ఆ కాలేజీలకు తాళం తప్పదా..

ఆ కాలేజీలకు తాళం తప్పదా..

కనీసం పాటించాల్సిన ప్రమాణాలను పాటించని కళాశాలల జాబితాను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి.. ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే నిర్వహిస్తున్న కాలేజీలపై ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్‌ నిశిత దృష్టి సారించింది. ఇప్పటివరకు 3 దశల్లో 120 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల ద్వారా కమిషన్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

కొన్ని కాలేజీల పనితీరు అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషన్‌ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలో దారుణమైన పరిస్థితి ఉన్నట్లు తేల్చింది. దీంతో..నాలుగో విడత ఈ నెల 28-29 తేదీల్లో మరో 50 కాలేజీల్లో తనిఖీలు చేపట్టనుంది. వాస్తవ ప్రణాళికలో భాగంగా.. 2019-20-22 వరకు అంటే మూడు సంవత్సరాల సగటు కాలానికి ట్యూషన్‌ ఫీజులపై ఈ నెలాఖరులోనే హైకోర్టుకు, ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం.

English summary
Fee Regulatory commission may reccomand serious action on Private Engineering colleges which failed in maintaining minimum needs and faculty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X