వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశువులకు"బీరు నీరు"తాగిస్తున్నారు; కానీ...ప్రమాదం...ఎందుకంటే?...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కొందరు పశువుల పెంపకందారుల అత్యాశ పాడి గేదెలకు ప్రాణాంతకంగా మారింది. అధిక పాల దిగుబడి కోసం వీరు చేస్తున్న విన్యాసాలు మూగజీవాల ప్రాణాలకు చెలగాటంగా తయారయ్యాయి. పాలు రెట్టింపు ఇస్తాయంటూ గేదెలకు బీరు వ్యర్థ ద్రావకాలను తాగిస్తున్న తీరు...బంగారు గుడ్డు కోసం బాతును చంపుకున్నకథను తలపిస్తోంది...వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల...ముఖ్యంగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కొందరు పెంపకందారులు పశువులకు దాణాగా బీరు వ్యర్థాలను వాడుతున్నారు...అధిక పాల దిగుబడి వస్తోందంటూ బీరు వ్యర్థాన్నిఎరగా వాడి మూగజీవుల జీవిత కాలాన్నిహరించి వేస్తున్నారు. వాటి పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేస్తున్నారు. కుటుంబ పోషణకు జీవితకాలం అండగా నిలిచే ఈ పాడిపశువులను తాత్కాలిక ప్రయోజనాల కోసం చేజేతులారా చంపుకుంటున్న వైనం పై ప్రత్యేక కథనం...

పాలల్లో పోషకాలు...కానీ...అధికపాల కోసం..

పాలల్లో పోషకాలు...కానీ...అధికపాల కోసం..

పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే...పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి రోజూ ఏదో రకంగా పాలో..లేక పాల పదార్థాలో తప్పనిసరిగా తీసుకుంటారు. దీంతో మార్కెట్ లో పాలకు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో..ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు పెంపకందారులు గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారన్న సంగతి కూడా మనకు తెలిసిందే. దీనివల్ల ఎక్కువ పాలు వస్తాయన్న విషయం నిజమే కానీ ఇలాంటి పాలు తాగితే అనార్యోగం...లేని పోని సమస్యలు తలెత్తడం ఖాయమనేది కూడా వాస్తవమే...

పశువుల పెంపకంలోకి...మద్యం ఉత్పత్తులు...ఇలా ప్రవేశం...

పశువుల పెంపకంలోకి...మద్యం ఉత్పత్తులు...ఇలా ప్రవేశం...

బీరు పరిశ్రమలోని వ్యర్థ పదార్థమైన గోధుమ పిప్పి (స్పెంట్‌మాల్ట్‌)ను పాడిపశువులకు దాణాగా ఉపయోగించి అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చని ముందుగా తెలంగాణాలో కొందరు రైతులు గుర్తించినట్లు తెలిసింది. అనంతరం ఈ విధంగా అధిక పాల దిగుబడి సాధించేందుకు రామచంద్రాపురంలోని అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) రైతులకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఈ మద్యం ఉత్పత్తులు పశువుల పెంపకం రంగంలోకి ప్రవేశించాయి. బీరుపరిశ్రమ నుంచి స్పెంట్‌ మాల్ట్‌ను కొన్ని పొదుపు సంఘాలు కిలోల చొప్పున కొని పాడి రైతులకు కొంత లాభంతో అమ్మేవారు. అలా తెలంగాణాలోని ఫసల్‌వాది గ్రామంలోనే దాదాపు 60 మంది పొదుపు సంఘాల మహిళలు, రైతులు ఈ దాణాను వారి పాడిపశువులకు ఉపయోగించి అధిక పాల ఉత్పత్తిని పొందుతున్నారు.

 రాయలసీమలో...బీరు పొడితో...ప్రారంభం...

రాయలసీమలో...బీరు పొడితో...ప్రారంభం...

రాయలసీమలో రాయచోటి పశు సంవర్ధ శాఖ పరిధిలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ 30వేల మందికి పైగా పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన ప్రచార మాయలో పడిన రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు కొద్దిగా ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరు తయారీలో మిగిలే వ్యర్ధమైన పొడిని తినిపించి తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కాసులు పండించుకుంటున్నారు.40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.330లకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయాల్సిందిపోయి దాన్ని ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

 ఇప్పుడైతే...ఏకంగా...మద్యం వ్యర్థ ద్రావకాలు...

ఇప్పుడైతే...ఏకంగా...మద్యం వ్యర్థ ద్రావకాలు...

మార్కెట్లో పాల కోసం పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని పశువుల నుంచి మరిన్ని పాలు అధికంగా పిండుకునేందుకు వాటికి ప్రమాదకరమైన మద్యం వ్యర్థ ద్రావకాలు తాగిస్తున్నారు...మద్యం ఉత్పత్తులు ఎవరికైనా ప్రమాదకరమే...మనుషుల కైనా..పశువులకైనా సరే... అలాంటిది మద్యం తయారీ సందర్భంగా వచ్చేవ్యర్థ ద్రావకాలు మరింత ప్రమాదం. కానీ అలాంటి వ్యర్థ ద్రావకాలను ఆవులు గేదెలకు పట్టిస్తున్నారు కొందరు అత్యాశపరులైన పెంపకందారులు. వింటుంటేనే బాధ కలిగిస్తున్నఈ విషయం...ఆ మద్య వ్యర్థ ద్రావకాన్నిపశువులకు తాగిస్తున్న తీరు చూస్తే ఒళ్లు జలదరిస్తుందట...కారణం ఆ ద్రావకం విపరీతమైన దుర్గంధంతో చూడ్డానికే తేడాగా ఉంటుందట. అయినా సరే అక్రమార్కులైన కొందరు పశుపోషకులు అధిక పాల దిగుబడి వస్తుందన్న ఏకైక కారణంతో బీరు వేస్ట్ లిక్విడ్ ని కొనుక్కొచ్చి మరీ కుడితిలా తాగిస్తున్నారట.

 అయితే...ఆంధ్రప్రదేశ్ లో...రాయలసీమలో...

అయితే...ఆంధ్రప్రదేశ్ లో...రాయలసీమలో...

అనంతరకాలంలో ఆంధ్రప్రదేశ్ లో...రాయలసీమలోని రాయచోటిలో ముందుగా ఈ మద్యం వ్యర్థాల వాడకం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాయచోటి పశు సంవర్ధ శాఖ పరిధిలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ 30వేల మందికి పైగా పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. కొందరు స్వార్థపరులు తమ లాభార్జన కోసం చేసిన ప్రచార మాయలో పడిన రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు కొద్దిగా ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరు పొడిని తినిపిస్తూ దీర్ఘకాలంలో తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. అయితే మద్యం వర్థాలను అమ్మే దళారులు మాత్రం రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసుల పంట పండించుకుంటున్నారు. ఎందుకు పనికిరాని 40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.400 నుంచి 500 వరకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఈ పనికిరాని వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయకుండా దాన్ని కూడా ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

 మరింత ఆశతో...బీరు వ్యర్థ ద్రావకం...

మరింత ఆశతో...బీరు వ్యర్థ ద్రావకం...

అయితే బీరు పరిశ్రమలోని వ్యర్థ పదార్థమైన గోధుమ పిప్పి(స్పెంట్‌మాల్ట్‌)కన్నా బీరు తయారీ అనంతరం మిగిలే వ్యర్థద్రావకం(వేస్ట్ లిక్విడ్)
మరింత తక్కువకు దొరుకుతుండటంతో దీన్ని కొనుగోలు చేసి కుడితిలా తాగిస్తున్నారు. వీటిని తాగిన పశువుల్లో కార్బోహైడ్రేట్స్ భారీగా వృద్ది చెంది పాల దిగుబడి 30 నుంచి 40 శాతం వరకు పెరుగుతుంది. దీంతో పశుపోషకులు ఈ వ్యర్థాలను కొనుగోలు చేసి వినయోగిస్తుండగా వీరిని చూసి పాధారణ రైతులు కూడా ఇదే బాట పట్టారు. దీంతో ఎక్కడో దూరంగా పారవేయాల్సిన ఈ వ్యర్థాలను యథేచ్చగా ట్యాంకర్ల ద్వారా డెయిరీ ఫారంకు తీసుకొచ్చి పీపాల్లో నింపివెళుతున్నారు. వీరి నుంచి రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారు.

 పశువులకు...ఎంత ప్రమాదమంటే...

పశువులకు...ఎంత ప్రమాదమంటే...

ఈ బీరు వ్యర్థ ద్రావకం నిల్వల్లో ప్రాణాంతాక సూక్ష్మజీవులు చేరతాయని, కంటికి కనిపించని ఫంగస్ తయారై అది పశువు కడుపులోకి చేరి జీర్ణవ్యవస్థపై తీవ్ర దుష్ర్పభావం చూపిస్తుందని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ మత్తు పదార్థం తాగడం వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువ ఇచ్చినా... ఉత్పత్తి కూడా అంతే త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. పాలు కూడా నాణ్యత కోల్పోయి దుర్గంధం వస్తాయి. ఈ పాలు త్వరగా చెడిపోతాయి. అసాధారణంగా అధిక పాలను ఇవ్వడం వల్ల తన శరీరంలోని శక్తిని త్వరగా కల్పోయి పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుందని తెలిపారు. రెండు ఈతలు తరువాత చూడి నిలబడదని, ఒక వేళ చూడి నిలబడినా ఈనే లోపు దూడ మృతి చెందడమో...లేక మధ్యలో ఈసుకపోవడమో సంభవిస్తుందని సూచిస్తున్నారు. 15-16 సంవత్సరాలు జీవించాల్సిన పాడి పశువు కేవలం 7-8 సంవత్సరాలకే మరణిస్తాయని తెలిపారు. పాడి పశువు జీవిత కాలంలో 8-10 దూడలను ఇచ్చే సామర్థ్యం వీటి వినియోగంతో కేవలం రెండు లేదా మూడిటికే పరిమితమవుతుంది. పైగా ఈ బీరు నీరు తాగిన పశువులు నుంచి వచ్చే పేడ, మూత్రం కూడా తీవ్ర దుర్వాసనతో ఉండటమే కాదు వాటివల్ల పరిసరాలు కూడా కాలుష్యమవుతాయట.

ఎందుకిలా...చేస్తున్నారు...నియంత్రణ ఎలా?

ఎందుకిలా...చేస్తున్నారు...నియంత్రణ ఎలా?

పశుపోషణకు గతంలో లాగా గడ్డి, ఇతర పదార్థాలు దొరకకపోవడం, వీటి దాణాకు వాడే పదార్థాల ధరలు పెరిగిపోవడం తో ప్రత్యామ్నాయంగా పశు పోషకులు ఈ బీరు వ్యర్థ ద్రావకాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో నష్టాలు ఉన్నా ప్రస్తుతం తక్కువ ఖరీదుకే కొనుగోలు చేసి పశువుల ద్వారా అధిక పాల దిగుబడి సాధించడం అనే అంశానికి వీరు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ బీరు వ్యర్థ ద్రావకం వినియోగంతో పశువుల్లో ఏమైతే దుష్ఫలితాలు సంభవిస్తాయో వాటి పాలు తాగిన మనుషులకు కూడా అవే నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలని, ఆ పశువుల మాంసం కూడా ప్రమాదకరమేనని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ "బీరు నీరు" వాడకం ద్వారా ప్రత్యక్షంగా వాటి ప్రాణాలతో...పరోక్షంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

English summary
Feeding Beer waste liquid to cattle is high in extract. Just because something likes to drink it doesn't mean it is good for them or to the environment. Beer waste fluids damages cattle in several ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X