వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా హోంగార్డు బరితెగింపు..! ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా వైరస్ మీద యుద్దం చేస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్న తరుణంలో ఏపిలో మాత్రం ఓ విచిత్ర పరిణామం చోటుసుకుంది. ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని హేళన చేస్తూ ఓ మహిళా హోంగార్డ్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసింది.

సీఎం పై అవమానకర పోస్టులు... ఏపీలో మహిళా హోంగార్డు నిర్వాకం...

సీఎం పై అవమానకర పోస్టులు... ఏపీలో మహిళా హోంగార్డు నిర్వాకం...

ఆంధ్ర ప్రదేశ్ లో ఏకంగా ముఖ్యమంత్రిని అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మహిళా హోంగార్డుతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిపై మహిళా హోంగార్డు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మహిళా హోంగార్డుతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిపై మహిళా హోంగార్డు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది.

ఆందోళన వ్యక్తం చేసిన సీఎంవో.. రంగంలోకి దిగిన పోలీసులు..

ఆందోళన వ్యక్తం చేసిన సీఎంవో.. రంగంలోకి దిగిన పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకున్న ఈ సంఘటన పొలిటికల్ సర్కిల్ లో వాడి వేడి చర్చకు కారణమవుతోంది. గంటా విజయ సుగుణ అలియాస్ నర్రా ప్రవీణ చౌదరి ఏలూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఆమె భర్త నర్రా గోపీ కృష్ణ చౌదరిలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్టులను షేర్ చేసారు. దీంతో ఒక్కసారిగా అవి వైరల్‌గా మారాయి. కొన్ని వేల మంది ఆపోస్టులను ట్రోల్ చేస్తూ రిప్లై లు పెట్టారు. ఇక అవి కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఐపీ అడ్రస్ ల ద్వారా నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. మహిళా హోం గార్డ్ అరెస్ట్..

ఐపీ అడ్రస్ ల ద్వారా నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. మహిళా హోం గార్డ్ అరెస్ట్..

దీంతో సత్వరం స్పందించిన పోలీసులు మహిళా హోంగార్డు, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. కాగా గతంలో కూడా వీరిపై ఇలాంటి కేసులే నమోదయ్యాయని వారు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. బాద్యతగల హోదాలో ఉన్న వారు సైతం అప్పుడప్పుడూ ఆకతాయి పనులు చేస్తుంటారని, అవి వారి ఇళ్లకే పరిమితమైతే పరవాలేదు గాని స్వయంగా ముఖ్యమంత్రినే అవమానపరిస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Recommended Video

CM Jagan Launches Zero Interest Scheme Today
సోషల్ మీడియాలో అసభ్య పోస్తులు పెడితే కఠిన శిక్షలు.. పోకిరీలకు ఏపీ పోలీసుల హెచ్చరికలు..

సోషల్ మీడియాలో అసభ్య పోస్తులు పెడితే కఠిన శిక్షలు.. పోకిరీలకు ఏపీ పోలీసుల హెచ్చరికలు..

గతంలో ఇలాంటి పోస్టులు ద్వారా కొంత మంది రాజకీయ నాయకులను, సినిమా సెలబ్రిటీలను సోషల్ మీడియాలో హేళన చేసిన కొంత మంది పోకిరీలను పోలీసులు గతంలో గుర్తించి శిక్షించారు. తర్వాత కొంత కాలం ఇలాంటి వేధింపులకు తెరపడింది. తాజాగా పోలీసులు కరోనా కట్టడి విధుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఐన మహిళా హోంగార్డు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పైనే అనుచితంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. సైబర్ క్రైం పోలీసులు స్పందించి ఐపీ అడ్రస్ ల ద్వారా మహిళా హోంగార్డ్ నిర్వాకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. భవిశ్యత్తులో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

English summary
A strange evolution occurred in the AP when all the states along the country were alerted to the coronavirus. A female homeguard has shared derogatory posts on social media mocking AP chief minister YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X