విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన మా జీవితాలతో ఆడుకున్నాడు,లైంగిక వేధింపులు,హత్యలు కూడా:కబడ్డీ క్రీడాకారిణుల ఆరోపణలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో మరో పెను దుమారం రేగింది. కొద్ది రోజుల క్రితమే అర్జున అవార్డు గ్రహీత ఎపి క్రీడాప్రాధికార సంస్థ శాప్ పై తిరుగుబాటు జరిపిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తాజాగా ఎపి క్రీడారంగాన్ని మరో పెద్ద వివాదం చుట్టుముట్టింది. విషయానికొస్తే...

కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వీర్ల లంకయ్య తమ జీవితాలతో ఆటాడుకున్నాడని పలువురు కబడ్డీ క్రీడాకారిణులు తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాల తరబడి పదవిలో కొనసాగుతూ వీరలంకయ్య చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్‌లో గురువారం కబడ్డీ అసోసియేషన్‌ కృష్ణా జిల్లా కార్యదర్శి వై. శ్రీకాంత్‌తో కలసి కబడ్డీ క్రీడాకారిణులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 లక్షలు ఇవ్వు...నీకిస్తే నాకేంటి లాభం...

లక్షలు ఇవ్వు...నీకిస్తే నాకేంటి లాభం...

విశాఖపట్నం కబడ్డీ క్రీడాకారిణి సునీత మాట్లాడుతూ...నిరుపేద కుటుంబానికి చెందిన తాను రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశానని...15 నేషనల్స్‌ ఆడిన నేను కబడ్డీ ఫెడరేషన్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ నిజమైనదేనంటూ ఇచ్చే ఫాం-2ని ఇవ్వమని కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వీర్ల లంకయ్యని ఫోన్‌లో అభ్యర్థించాను...అందుకు ఆయన రూ.లక్షలు డిమాండ్‌ చేశారు...పైగా "నీకిస్తే నీ నుంచి నాకేంటి లాభం" అంటూ ద్వందార్థంతో మాట్లాడారని ఆరోపించారు.
పైగా ఆ సర్టిఫికెట్ కోసం అక్కడికి, ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుందని, అంత తేలిక కాదని, ఎన్నో చేయాల్సి ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా లైంగికంగా వేధించారని పేర్కొంది. అదేమని అడిగితే టాపిక్ డైవర్ట్‌ చేసి మాట్లాడేవారని ఆమె వివరించారు. 15 జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న తాను చివరకు ఫాం-2 అడిగితే నిరు పేదనైన నాకు వీర్ల లంకయ్య చాలా అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

సర్టిఫికెట్లు అమ్ముకోవడం...జీవితాలు నాశనం

సర్టిఫికెట్లు అమ్ముకోవడం...జీవితాలు నాశనం

అనంతరం ఇతర కబడ్డీ క్రీడాకారిణిలు మాట్లాడుతూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వీర్ల లంకయ్య సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు. దీనివల్ల అసలు క్రీడాకారులు కానివారు ఉద్యోగాలు సంపాదించుకోగా, నిజమైన క్రీడాకారులకు చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రశ్నించిన...క్రీడాకారిణి హత్య...

ప్రశ్నించిన...క్రీడాకారిణి హత్య...

ఇలా సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని నిలదీసిన కారణంగా 1995లో ప్రియదర్శిని అనే కబడ్డీ క్రీడాకారిణిని తన కారులో వీర్ల లంకయ్య హత్య చేశారని క్రీడాకారిణులు ఆరోపించారు. వీర్ల లంకయ్యను వెంటనే అసోసియేషన్‌ నుంచి తొలిగించాలని వారు డిమాండ్‌ చేశారు. అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

20 ఏళ్లుగా...ఒకే పదవిలో....నేరం

20 ఏళ్లుగా...ఒకే పదవిలో....నేరం

వీర్ల లంకయ్య 20 ఏళ్లుగా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా అదే పదవిలో కొనసాగుతున్నాడని, అలా కొనసాగడం నేరమని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి వై.శ్రీకాంత్‌ ఆరోపించారు. కబడ్డీ ఆడినవారికి కాకుండా బయట వ్యక్తులకు కబడ్డీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని, దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మీడియాకు తెలిపారు. తమకు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్‌ న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కబడ్డీ క్రీడాకారిణులు ధనలక్ష్మి, సునీత, గౌతమి(విశాఖపట్నం), నవ్య, కేఎల్‌వీ రమణ(కృష్ణా) తదిదరులు పాల్గొన్నారు.

English summary
Female kabaddi players have alleged that Veerla Lankakiah, the general secretary of Kabaddi Association, destroyed many players' lives. The players have expressed their disappointment that all the brutalities that have gone through the decades by Veerla Lankaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X