హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్య విద్యార్థిని ఆత్మహత్య: డాక్టర్ కారణమని నోట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన మృతికి ఓ వైద్యురాలు కారణమంటూ లేఖ రాసి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధ ఘటన నగరంలోని నల్లకుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...వరంగల్ జిల్లా హన్మకొండ నగరానికి చెందిన డిగ్రీ కళాశాల లెక్చరర్ వెంకటయ్య, లక్ష్మీదంపతుల కుమార్తె మాధవి(27). ఇటీవలే ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆమె విద్యానగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో పనిచేస్తూ రెండున్నర నెలల క్రితమే గైనకాలజిస్ట్ విభాగంలో పీజీ వైద్యవిద్యలో చేరింది.

కాగా, ఇక్కడి ఆస్పత్రిలోని వసతి గృహంలో ఆదివారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌కు చెందిన వ్యక్తి మధ్యాహ్న సమయంలో గుర్తించి నిర్వాహకులకు, ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేయగా వారు నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. కాచిగూడ ఏసీపీ సుధాకర్‌, నల్లకుంట ఎస్‌ఐ చిరంజీవులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

 Female Medical Student Commits Suicide in Hyderaba

మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గదిలో తనిఖీ చేయగా వారికి సూసైడ్‌నోట్‌ కనిపించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి డ్యూటీ డాక్టర్‌ మార్త సరోజిని కారణమని రాసి ఉంది. మాధవి మృతి చెందిన విషయాన్ని పోలీసులు వరంగల్‌లో ఉన్న వెంకటయ్యకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. సాయంత్రానికి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వెంకటయ్య సూసైడ్‌నోట్‌ను చూసి అందులోని చేతి రాత మాధవిదేనని ధ్రువీకరించారు.

తన కుమార్తె ఆత్మహత్యకు డాక్టర్‌ సరోజిని, ఆస్పత్రి యాజమాన్యం కారణమని, వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చిరంజీవులు తెలిపారు.

సరోజినిని అరెస్ట్‌ చేయాలి : వెంకటయ్య

తన కుమార్తె ఆత్మహత్యకు కారకురాలైన డాక్టర్‌ సరోజినిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని మృతురాలి తండ్రి
వెంకటయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం సాయంత్రం నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె చిన్నప్పటి నుంచి చదువులో రాణించేదని చెప్పారు. సరోజినిపై ఆస్పత్రి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తాము ఘటనా స్థలానికి రాకముందే పోలీసులు మృతదేహాన్ని ఎందుకు తరలించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు కారకులైన వారిపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.

English summary
A 24-year-old female post graduate medical student allegedly commited suicide by hanging herself from ceiling of her hostel room at Nallakunta in Hyderabad on Sunday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X