వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి టీడీపీ ఆఫ‌ర్‌..జ‌గ‌న్‌ని కాద‌నా: బాబు విదేశీ టూర్ ముందు ఏం జ‌రిగింది: ఇలా తేల్చేసారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ ఏపీలో టీడీపీని టార్గెట్ చేసందనే స‌మాచారంతో తెలుగుదేశం అధినాయ‌క‌త్వం అప్ర‌మ‌త్త‌మైంది. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుంద‌ని టీడీపీ భావించింది. అయితే వైసీపీ అందుకు నో చెప్ప‌టంతో..తిరిగి టీడీపీ పావులు క‌దిపింది. పార్టీ సీనియ‌ర్ల ద్వారా బీజేపిక ఆఫ‌ర్ ఇచ్చింది. జ‌గ‌న్‌ని కాద‌ని ఎలా చేయ‌గ‌ల‌గ‌మ‌ని ప్ర‌శ్న ఎదురైంది. టీడీపీ ప్రతిపాద‌న పైన బీజేపీ నేత‌లు తేల్చి చెప్పేసారు. ఆ త‌రువాత‌నే ఎంపీల చేరిక‌..ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది..

బీజేపీకి టీడీపీ ఆఫ‌ర్‌...
ఏపీలో అసెంబ్లీ స‌మావేశాల నోటిఫికేష‌న్ జారీ అయింది. అదే స‌మ‌యంలో టీడీపీ కి చెందిన మాజీ కేంద్ర మంత్రి.. మరో ఇద్ద‌రు కీల‌క నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలోనే రాజ్య‌స‌భలో ఉన్న టీడీపీ ఎంపీలు బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం వ‌చ్చిన విష‌యాన్ని అధినేత వ‌ద్ద ప్ర‌స్తావించారు. ఆయ‌న వారించే ప్ర‌య‌త్నం చేసారు. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల మ‌ధ్య ఊహించ‌ని విధంగా కొత్త ప్రతిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. రాజ్య‌స‌భ‌లో వారికి సంఖ్యా బ‌లం కావాలి..మ‌న‌కు వారితో స‌ఖ్య‌త కావాలి. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. తిరిగి బీజేపీతో క‌లిసి ప‌ని చేయ‌టానికి ఇబ్బంది లేదు. దీంతో..అధినేత‌క త‌మ అభిప్రాయం చెప్ప‌గా..ప్ర‌య‌త్నం చేయ‌మ‌ని సూచించార‌ని చెబుతున్నారు. బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చించి..ఈ ప్రతిపాద‌న‌కు వారి అభిప్రాయం తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారంఎన్డీఏతో బంధం తెంచుకోవ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం ఇప్ప‌టికే చాలా మంది వ్య‌క్తం చేసారు. ఇప్పుడు మ‌న‌కు స‌మ్మ‌త‌మే..వారు స‌రే అంటే ముందుకెళ్ధాం అని వారు నిర్ణ‌యించి ముంద‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది.

Few days before TDP offered political relation with BJp once again. But BJP Rejected TDP proposal

Recommended Video

టీడీపీలో నం.2 స్థానం ఎవరిది?

బీజేపీ నేత‌లు ఏమ‌న్నారంటే..
ఇదే విష‌యం పైనా బీజేపీ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న ఆ నేత ఇదే అంశాన్ని బీజేపీ ముఖ్యుల వ‌ద్ద ప్ర‌స్తావించారు. తాము ఏపీలో చంద్ర‌బాబుతో వ‌ద్ద‌నుకున్నాం. ఆయ‌న ఎన్డీఏలోకి వ‌స్తామ‌ని చెప్పినా..డోర్లు మూసేస్తాం అని ఏపీలోనే ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేసారు. కావాల‌నుకుంటే ఎంపీలుగా ఉన్న మీరు బీజేపీలోకి రండి. అంతే కానీ..చంద్ర‌బాబును మాత్రం ఉపేక్షించే ప‌రిస్థితి లేద‌ని తేల్చి చెప్పారంటూ ఢిల్లీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ త‌మ‌తో స‌న్నిహితంగా ఉంటున్న విష‌యాన్ని ఆ చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావించారు. ఇదే స‌మాచారం తిరిగి అధినేత‌కు చేర‌వేసిన నేత‌లు తాము వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని..అర్దం చేసుకోవాల‌ని కోరారు. చంద్రబాబు వారించే ప్ర‌య‌త్నం చేసినా వారు విన‌లేదు. ఇదంతా చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్ల‌క ముందు జ‌రిగిన వ్య‌వ‌హారం. ఇక‌, పార్ల‌మెంట్‌లో అమిత్ షాతో స‌మావేశ‌మైన ఈ న‌లుగురు తాము సిద్ద‌మ‌ని చెప్పారు. అంతే మిగిలిన ప్ర‌క్రియ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి.

English summary
Few days before TDP offered political relation with BJp once again. But BJP Rejected TDP proposal . Then they started operation TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X