విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోమలపై డ్రోన్‌ లతో యుద్ధం...సమస్యకు పరిపూర్ణ పరిష్కారం:సిఎం చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: రాష్ట్రంలో దోమల్ని నివారించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సవాల్ గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో 'ఆరోగ్య ఉత్సవం' ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో దోమల నివారణకు పరిపూర్ణ పరిష్కారాన్ని చూపెడతామని చెప్పారు. దీనికోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని తేనున్నామని, తద్వారా అనేక వ్యాధులకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణలో భాగంగా డ్రోన్‌లను ఉపయోగించే పద్ధతుల్నీ అనుసరించనున్నట్లు సిఎం చంద్రబాబు వివరించారు.

Fight against mosquito with drones:CM Chandrababu

డ్రోన్ ద్వారా నగరంలో దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల వివరాలు సేకరించడానికి డ్రోన్లను వినియోగించనున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మారుమూల పల్లెలకూ ఆధునాతన వైద్య సేవలందేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చంద్రబాబు చెప్పారు.
విశాఖపట్నంలో ఆరోగ్యశాఖ, మెడ్‌టెక్‌ జోన్‌ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న 'ఆరోగ్య ఉత్సవం' ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ఈ సందర్భంగా 5 కొత్త పథకాల్ని ప్రారంభించారు. ఈ- సబ్‌సెంటర్లు, ఆర్‌ఎఫ్‌ఐడీ, ముఖ్యమంత్రి బాల సురక్ష యోజన పథకాల్ని ప్రారంభించడంతోపాటు ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను, ఏపీ మెడికల్‌ రీహాబిలిటేషన్‌ టూరిజంను సిఎం చంద్రబాబు ఇదే వేదికపై ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టెలీ మెడిసిన్ పద్దతి విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వసతిని కల్పిస్తున్నామని...దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టెలీ మెడిసిన్‌ సేవల్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గూగుల్‌ సాంకేతికతతో ఒక గ్రామం నుంచి 20 కి.మీ. దూరం వరకూ ఎలాంటి తీగల్లేకుండా కేవలం బ్యాండ్‌విడ్త్‌ ద్వారానే టెలీ మెడిసిన్‌ సేవలు అందేలా చేస్తున్నామని చెప్పారు.

3 ఐటీడీఏల్లో 40 సబ్‌సెంటర్లను ఈ- సబ్‌సెంటర్లుగా మార్చామని...ఆయా కేంద్రాలకు రోగులొచ్చాక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులు మాట్లాడతారని చంద్రబాబు వివరించారు. ఆన్‌లైన్‌లో మందుల వివరాలు నమోదు చేయడం...వెండింగ్‌ మిషన్‌ ద్వారా ఆటోమేటిక్‌గా మందులు తీసుకునే విధానం కూడా అమలులోకి తెచ్చామని...గురువారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

English summary
Vishakhapatnam: Chief Minister Chandrababu Naidu has announced that the Andhra Pradesh government has taken the challenge of avoiding mosquitoes in the state. CM Chandrababu attended as the chief guest to the end of the 'health festival' in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X