India
  • search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కత్తి మహేష్ కన్నుమూత : చెన్నైలో చికిత్స పొందుతూ ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

సినీ విమర్శకుడు..నటుడు కత్తి మహేష్ కన్నుమూసారు. గత వారం నెల్లూరు జిల్లా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, బ్రెయిన్ కు దెబ్బ తగలటంతో పాటుగా రెండు కళ్లు చూపు కోల్పోయారు. దీంతో..మెరుగైన చికిత్స కోసం మహేష్ ను సన్నిహితులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కంటికి ఆపరేషన్ సైతం నిర్వహించారు. ఆయన కోలుకుంటున్నాడంటూ ఆయన మిత్రులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం రూ 17 లక్షలు మంజూరు చేసింది. అప్పటి నుండి అపోలోలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు.

 చికిత్సకు సహకరించని అవయవాలు

చికిత్సకు సహకరించని అవయవాలు


చిత్తూరు జిల్లాకు చెందిన కత్తి మహేష్ హైదరాబాద్ లో స్థిర పడ్డారు. అనేక వివాదస్పద చర్చల్లో పాల్గొని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని సినిమాల్లోనూ కత్తి నటించారు. కోలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో కత్తి మహేష్ తలకు తగిలిన బలమైన గాయం తో పాటుగా శరీర అవయవాలు చికిత్సకు సహకరించకపోవటంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

 పలు సినిమాల్లో నటించిన కత్తి మహేష్

పలు సినిమాల్లో నటించిన కత్తి మహేష్

1977లో జన్మించిన కత్తి మహేష్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ విమర్శకుడిగా సినీ రంగం పైన పట్టు సాధించే క్రమంలో విమర్శకుడిగా పలువురు ప్రముఖ హీరోల సినిమాలకు రేటింగ్ లు..రివ్యూలతో వార్తల్లో నిలిచారు. కామెడీ సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. రాం గోపాల్ వర్మ తీసిని ఒక మూవీలోనూ కత్తి నటించారు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట తో పాటుగా తాజా రవితేజ హీరోగా విడుదలైన క్రాక్ సినిమాలోనూ నటించారు. 2017 లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ లోనూ కత్తి మహేష్ కంటెస్టెంటె గా పాల్గొన్నారు. అనేక చర్చల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారానికి కారణమయ్యాయి.

Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon
 వివాదాస్పదంగా...

వివాదాస్పదంగా...

ఒక స్వామీజీ ఫిర్యాదు ఆధారంగా కత్తి ని హైదరాబాద్ నగర బహిష్కరణ చేసారు. కొన్ని సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు..పవర్ స్టార్ ఫ్యాన్స్ రియాక్షన్ తో ఆ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగింది. పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అప్పట్లో కత్తి మహేష్ ను ఆట ఆడుకున్నారు. ఈ నెల 26న నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో కారు యాక్సిడెంట్ లో చికిత్స పొందుతూ కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే రెండు వారాలుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

English summary
Film critic Kathi Mahesh breathed his last while undergoing treatment in Chennai Appolo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X