అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపూర్వ స్వాగతం: గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను అరకు ఏజెన్సీ ప్రాంతంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, తన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను దత్తత తీసుకున్న అరకు మండలం పెదలబుడు గ్రామంలో చంద్రబాబు మంగళవారం పర్యటించి, గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన ఈ ప్రయత్నం మరికొంతమందికి స్పూర్తిదాయకం కావాలని భావించి, గిరిజన గ్రామాన్ని ఎంపిక చేసుకున్నానని ఆయన చెప్పారు. విశాఖ ఏజెన్సీని విద్య, వైద్య, పర్యాటక రంగాల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు.

విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా అరకు కాఫీని ప్రధాని మోడీకి రుచి చూపించామని, అద్భుతమైన కాఫీ సేవించిన ప్రధాని ఎంతగానో మెచ్చుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేస్తున్న అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

అలాగే అరకు ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. అరకులో అపెరల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘థింసా'కు కూచిపూడి తరహాలో ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా అరుకులో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

థింసా నృత్యానికి గుర్తింపును కల్పించడం ద్వారా గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత నిస్తూనే గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించట్లేదని, మన రాష్ట్రంలో గిరిజనులకు గుర్తింపునిచ్చి, వారి అభ్యున్నతికి చేయూతనిస్తున్నట్టు వెల్లడించారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

వచ్చే ఏడాది జరిగే ఆదివాసీ దినోత్సవాన్ని అరకులోనే నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఏడాది తరువాత తాను ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తానని, ఇప్పుడు ఏదైతే హామీలిచ్చామో అవన్నీ అమలయ్యేందుకు కృషి చేస్తానన్నారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖ ఏజెన్సీలో రూ.526 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

అలాగే ప్రస్తుతం ఏజెన్సీలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం

అరకు ఏజెన్సీ పరిసరాల్లో విస్తారంగా ఉన్న వనరులను గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తామన్నారు. గిరిజనుల హక్కులను కాపాడుతూనే ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

English summary
Finally, chief minister N Chandrababu Naidu on Tuesday visited Pedalabudu village, in Visakha Agency area that he adopted two years ago and showered it with sops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X