విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యలమంచలి రవి:ఎట్టకేలకు...వైసిపిలో చేరిపోయాడు;వారథి ఊగిందా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

యలమంచలిని ఆహ్వానించిన జగన్

విజయవాడ:వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టడంతోనే విజయవాడ టిడిపి నేత యలమంచలి రవి ఆ పార్టీలో చేరిపోయారు.
టిడిపికి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో ఈ పరిణామం వైసిపి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

జగన్ పాదయాత్ర కృష్ణా వారధి వద్దకు చేరుకోగానే అప్పటికే తన అనుచరులు,అభిమానులు,మద్దతుదారులతో అక్కడ వేచిచూస్తున్న యలమంచలి రవి తాను పార్టీలో చేరుతున్నట్లు చెప్పగానే వైకాపా అధినేత జగన్ తమ పార్టీ కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు. యలమంచలి రవి చేరికతో విజయవాడలో వైసిపి బలపడుతుందని చెప్పారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో 13 నియోజకవర్గాల గుండా 270 కిలోమీటర్ల మేరా సాగనుంది.

Finally Yalamanchali Ravi Joined in YCP

మరోవైపు 136 రోజులుగా కొనసాగుతూ వస్తున్న జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా వైసిపి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ జనసందోహం అంతా జగన్ పాదయాత్రతో కలసి నడుస్తూ కృష్ణా వారధి దాటుతున్నతరుణంలో అందరూ ఒకేసారి వంతెన మీదుగా నడుస్తున్న క్రమంలో వారధి ఒక్కసారిగా ఊగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో జగన్ కూడా ఒక్క నిమిషం పాటు పాదయాత్ర నిలిపివేశారని అంటున్నారు. ఆ తరువాత పాదయాత్ర యధావిధిగా కొనసాగించారని, ఏదేమైనా పెను ముప్పు తప్పినట్లు అనిపించిందని ఈ పాదయాత్రలో పాల్గొన్న వైసిపి శ్రేణులు చెబుతున్నాయి.

అంతకుముందు యలమంచలి రవి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పొంతన లేని సమాధానాలు చెప్పటం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆ విధంగా తనను కూడా చంద్ర బాబు రెండు సార్లు మోసం చేశారని చెప్పారు. టీడీపీపై,చంద్రబాబుపై నమ్మకం పోయిన తానుకార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

English summary
Vijayawada:YSRCP chief YS Jagan Mohan Reddy's padayatra entered in Krishna district on its 136th day. YS Jagan will cover a distance of 270 kilometres and walk through 13 constituencies in the district. On this Occasion TDP Senior Leader Yalamanchili Ravi has joined in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X