వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది.

ఏడాది కి 15 వేలు..
ఏపిలోని కౌలు రైతుల కోసం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్న‌దాత సుఖీభ‌వ లో భాగంగా కౌలు రైతుల‌కు సాయం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే కేంద్రం ప్రకటించిన పీఎం-కిసాన్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదు. అయినా రాష్ట్రం సొంతంగా సాయం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,350 కోట్ల భారం పడనుం ది. ఇప్పటికే పంట రుణాలతోపాటు రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలోనూ ప్రభుత్వం వీరికి ప్రాధాన్య మిస్తోంది.

Financial Assistance for Tenant Farmers : rs 15000 per year..

మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇప్పించింది. రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు, వ్యవసాయశాఖద్వారా కౌలుదారు పత్రాలు మంజూరు చేయించింది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందించ నుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే సొంతంగా అయిదెకరాల లోపున్న రైతులకు రూ.9వేలు, అయిదెక రాల పైబడిన వారికి రూ.10వేలు ఇస్తుండగా.. సెంటు భూమి లేని కౌలు రైతులకు ఏకంగా రూ.15,000 చొప్పున ఇవ్వ నుంది.రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం గుర్తించిన 15.50 లక్షల మంది కౌలు రైతుల్లో సెంటు భూమి లేని వారు సుమారు 9 లక్షల వరకు ఉంటారని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.

పెట్టుబడి సాయం ఇలా..
ఏపి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన రైతు సాయం పై విది విధానాల‌ను ఖ‌రారు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.దీని ప్ర‌కారం.. అయిదెకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలకు రూ.9వేల చొప్పున రాష్ట్రం ఇస్తుంది. కేంద్రం పీఎం-కిసాన్‌ కింద ఇచ్చే రూ.6వేలతో కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.15వేలు అందుతుంది. పీఎం-కిసాన్‌ వర్తించని, అయిదెకరాల పైన ఉన్న రైతు కుటుంబాలకు రూ.10వేల చొప్పున రాష్ట్రమే ఇస్తుంది. అయిదెకరాల లోపు, అయిదెకరాలు పైబడిన రైతులకు తక్షణ సాయంగా రూ.4వేల మొత్తాన్ని మార్చి లోపు ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు.

Financial Assistance for Tenant Farmers : rs 15000 per year..

ఇందులో భాగంగా ఆర్టీజీ ఆధ్వర్యంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1,000 చొప్పున 44 లక్షల ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. వీరం దరి ఖాతాలకు నేరుగా నగదు జమ అయిందని నిర్ధరణ అయ్యాక మార్చిలో మిగిలిన రూ.3వేలు బదిలీ చేస్తారు. ఎన్నిక ల షెడ్యూల్ వ‌చ్చే లోగానే తొలి విడ‌త‌లో భాగంగా న‌గ‌దు జ‌మ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

English summary
AP govt taken key decision on financial assistance for Tenant farmers . Govt Decided to give rs 15000 per each tenant farmer family. At the same time govt issued G.O for Ananadatha Sukhibhava implentatin guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X