గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరి ఎన్నార్టీ ఐటీ పార్కులో అగ్నిప్రమాదం:ఘటనపై అనుమానాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇటీవలే నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఐటి కంపెనీలకు చెందిన కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధం అయినట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ జనవరి 17న వీటిని ప్రారంభించడం గమనార్హం.

మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌లో ఐటీ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, చార్వికెంట్‌ ఐటీ కంపెనీకి చెందిన 12 కంప్యూటర్లు, ఫర్నిచర్‌ తదితర సామగ్రి దగ్ధం కాగా, అద్వైత ఐటీ కంపెనీకి సంబంధించి కొద్ది సామాగ్రి మాత్రమే తగులబడిపోయినట్లు చెబుతున్నారు. ఆదివారం అయినందున కంపెనీలలో సిబ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం ముప్పు తప్పింది. మొత్తం మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

Fire Accident At new offices of 2 IT companies at NRT Tech Park

పోలీసులు కథనం ప్రకారం...తొలుత మంగళగిరిలోని ఎన్‌ఆర్టీ టెక్‌ పార్క్‌ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌ ఏరియాలో మంటలు మొదలయ్యాయి. ఆ తరువాత కొద్ది సేపట్లోనే ఫస్ట్‌ ఫ్లోర్‌లోని చార్వికెంట్‌ ఐటీ కంపెనీలోకి మంటలు వ్యాపించాయి...అనంతరం ఆ వెంటనే సెకండ్‌ ఫ్లోర్‌లోని అద్వైత ఐటీ కంపెనీకి విస్తరించాయి.
అయితే ఈ మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్‌ సిబ్బంది రాక ఆలస్యం అవుతుండటంతో మంటల విస్తృతి తగ్గించేందుకు పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి, స్థానికుల సాయంతో అద్దాలు పగులగొట్టించారు. ఘటన సమాచారం తెలుసుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అయితే మరోవైపు ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంటలు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియాలో ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఫైర్ అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు తలెత్తి ఉండొచ్చని చెబుతున్నప్పటికీ, అలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు విస్తరించాయనడానికి అవకాశం తక్కువగా ఉందని అంటున్నారు...పైగా ప్రమాదం ఆదివారం, ఎవరూ లేని సమయంలోనే జరగడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మంటలు క్షణాల్లోనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు విస్తరించడంపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రి లోకేష్ ఇటీవలే ఈ కంపెనీలను ప్రారంభించడంతో ఎవరైనా గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేవి పూర్తి విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అసలు ఈ భవనంలో నిబంధనల ప్రకారం సేఫ్టీ మెజర్స్‌ అసలు లేకున్నా కేవలం అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అనుమతులు ఇచ్చారని అధికారులే అంటున్నారని స్థానిక ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు.

English summary
Guntur: A fire accident broke out at NRT Tech Park near Mangalagiri town in Guntur district on Sunday afternoon. According to fire officials, they received a distress call sunday evening, when they were informed that a fire has broken out at the ground floor of the building. Within a few minutes, three fire tenders from Mangalagiri and Thullur stations rushed to the spot. However, by then the fire had spread to the first and the second floor. A Fire official said that although the cause of fire is yet to be ascertained, they suspect it to be a short circuit.These fire accident resulted an estimated RS. 20 lakhs loss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X