• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్య వాణి.. ఏకిపారేశారుగా !

|

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ , ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు దివ్య వాణి వైసీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తాజా రాజకీయ పరిణామాల పట్ల ఆమె తనదైన శైలిలో స్పందించారు. దాడులు జరిగిన ప్రతి చోటా కాపలా ఉండలేం కదా అన్న హోం మంత్రి వ్యాఖ్యల మీద , చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించటం మీదా, అలాగే ఎవరి డబ్బు ఎవరు వృధా చేస్తున్నారు అన్న దాని మీదా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

  చంద్రబాబు కే వెన్నుపోటు
  ప్రతీచోటా కాపలా ఉండలేమని చేసిన వ్యాఖ్యలతో హోం మంత్రి మహిళ అన్న సంతోషం ఆవిరైంది అన్న దివ్యవాణి

  ప్రతీచోటా కాపలా ఉండలేమని చేసిన వ్యాఖ్యలతో హోం మంత్రి మహిళ అన్న సంతోషం ఆవిరైంది అన్న దివ్యవాణి

  వైసీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి.. ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖమంత్రి మేకతోటి సుచరితపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు . ప్రతీచోటా కాపలా ఉండలేమని హోం మంత్రి వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంతి భద్రతలు కాపాడాల్సిన హోం మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం ప్రతీచోటా కాపలా ఉండలేమని అనడం సరికాదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు . హోంమంత్రే అలా అంటే ప్రజలు ఏమైపోవాలని దివ్య వాణి మంత్రి సుచరితను ప్రశ్నించారు . సుచరిత వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళ హోంమంత్రి అయ్యారన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైందని వ్యాఖ్యానించారు.

  చంద్రబాబుకు భద్రత తగ్గించింది వాస్తవం కాదా అని నిలదీసిన దివ్యవాణి

  చంద్రబాబుకు భద్రత తగ్గించింది వాస్తవం కాదా అని నిలదీసిన దివ్యవాణి

  ఇక మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించిన విషయం వాస్తవం కాదా? వాస్తవం కాదన్నట్టు ఎందుకు చెప్తున్నారు అని హోంమంత్రిని ప్రశ్నించారు. చెప్పేదొకటి , చేసేది మరొకటి అని మండిపడ్డారు. అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ, ప్రజల భద్రతపై కూడా ఉండాలని వైయస్ జగన్ సర్కార్ కు దివ్యవాణి సెటైర్లు వేశారు. అంతటితో ఆగక వైసీపీ నేత రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు దివ్య వాణి.

  ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా అన్న విజయసాయి ట్వీట్ కు ఘాటుగా బదులిచ్చిన దివ్యవాణి

  ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా అన్న విజయసాయి ట్వీట్ కు ఘాటుగా బదులిచ్చిన దివ్యవాణి

  తాజాగా మాజీ మంత్రి నారా లోకేశ్‌పైన విమర్శలు కురిపించారు విజయసాయి రెడ్డి. ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్? మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకుతిన్న విషయం బయట పడిందనా మీ ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?' అని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ మహిళా నేత దివ్యవాణి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు . ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులు చేశారు . ప్రజావేదిక హెరిటేజ్ సొమ్ముతో కట్టారా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చారు.

  కొట్టేయటంలో మీదే పీహెచ్‌డీ.. అని విజయసాయిని ఏకిపారేసిన దివ్యవాణి

  కొట్టేయటంలో మీదే పీహెచ్‌డీ.. అని విజయసాయిని ఏకిపారేసిన దివ్యవాణి

  అయ్యా అక్రమ సాయి రెడ్డి గారు అంటూ మొదలుపెట్టిన దివ్యవాణి ఆయన పోస్ట్ కు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. రంజాన్ పేరుతో 6 వేల మందికి భోజనాలు పెట్టడానికి రూ.1.1 కోట్లు (జి.ఓ-1206), ఈ సొమ్ము సండూర్ పవన్ కంపెనీ సొత్తా? జగన్‌గారి ఇంటి ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు (జి.ఓ-132), ఈ ఖర్చు భారతి సిమెంట్స్ నుండి ఖర్చు చేసారా? జగన్ నివాసం దగ్గర టాయిలెట్స్ కట్టడానికి రూ.30 లక్షలు (జి.ఓ-133), ఈ సొమ్ము జగతి పబ్లికేషన్స్ నుండి కట్టారా? జగన్‌గారి ప్యాలస్ దగ్గర బ్యారికేడ్లు పెట్టడానికి రూ.75 లక్షలు (జిఓ-133), ఈ సొమ్ము కార్మెల్ ఏషియా చెల్లించిందా? కొట్టేయడంలో మీరు పీహెచ్‌డీ చేశారు. మీ రికార్డులు మీరే తిరగరాస్తున్నారు. ఇక మిగిలింది గుడిలో లింగం మాత్రమే అంటూ దివ్యవాణి మండిపడ్డారు. విజయసాయి రెడ్డిని ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు.

  English summary
  The Telugu Desam Party's fire brand, spokes person Divya Vani is fired on YCP leaders. She responded in her own style to the latest political developments. On the home minister's comments that the attacks were not safe guarded she commented The Divine home Minister questioned the virtue of what the people should be like. After hearing the comments, Divya vani said that the joy of becoming a lady home minister is gone within a month, and she asked Is it not true that the TDP chief and former CM Chandrababu has reduced security ? she questioned and also she attacked in twitter on Vijayasai Reddy's comments .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X