చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడుకొండల్లో భారీగా మంటలు: తగ్గినట్లే తగ్గి.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల పుణ్యక్షేత్రం చుట్టు ఉన్న శేషాచలం అడవుల్లోని మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు తిరుమలకు చేరుకున్నాయి. నేనీ ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది.

రేణిగుంట విమానాశ్రయానికి నాలుగు హెలికాప్టర్లు చేరుకున్నాయి. అవి మంటలను ఆర్పే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్ల ద్వారా నీరు, రసాయనాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, పార్వేటి మండపం, కాకులమాను కొండల్లో తొలుత ఉదయం అదుపులోకి వచ్చిన మంటలు మధ్యాహ్నం మళ్లీ పెరిగాయి. తుంబుర తీర్థం మినహా అన్ని ప్రాంతాల్లో మంటలు మొదట అదుపులోకి వచ్చాయి. అయితే, ఆ తర్వాత మళ్లీ మంటలు చెలరేగియి. హైదరాబాద్, విజయవాడల నుండి ఫైర్ సిబ్బంది తిరుమలకు చేరుకుంది.

తిరుమల

తిరుమల

మూడు రోజులుగా చెలరేగుతున్న మంటల కారణంగా ఇప్పటికే వందలాది హెక్టార్ట విస్తీర్ణలో అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్రచందనం, చందనం, విలువైన ఔషధ వృక్షాలు, భారీ సంఖ్యలో వన్య ప్రాణులు కాలిబూడిదయ్యాయి.

తిరుమల

తిరుమల

కాకులకోనపై రెండు పవన విద్యుత్ ఇంజన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సుజ్లాన్ సంస్థకు 70 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది.

తిరుమల

తిరుమల

మంటలు ఇంకా మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు వెయ్యిమంది టిటిడి, అటవీశాఖ అధికారులు, అగ్ని మాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.

తిరుమల

తిరుమల

అవి ఫలించినట్లే కనిపిస్తున్నా, మరోవైపు క్షణాల్లో మరోచోట మంటలు చెలరేగిపోతున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు టిటిడికి చెందిన వనాల్లోకి మంటలు బుధవారం చొచ్చుకొచ్చాయి. ముందుజాగ్రత్త చర్యగా చెట్లపై నీళ్లను చల్లి తడుపుతున్నారు.

తిరుమల

తిరుమల

తిరుమల పుణ్యక్షేత్రం చుట్టు ఉన్న శేషాచలం అడవుల్లోని మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు తిరుమలకు చేరుకున్నాయి. నేనీ ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది.

తిరుమల

తిరుమల

రేణిగుంట విమానాశ్రయానికి నాలుగు హెలికాప్టర్లు చేరుకున్నాయి. అవి మంటలను ఆర్పే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్ల ద్వారా నీరు, రసాయనాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

తిరుమల

తిరుమల

తిరుమల శేషాచల కొండల్లోని కాకుల కొండ, పులుట్ల ప్రాంతాల్లో బుధవారం కూడా అగ్నికీలలు చల్లారలేదు. గురువారం వాటిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో ఇంతపెద్ద అగ్నిప్రమాదం జరగలేదని అధికారులు అంటున్నారు.

తిరుమల

తిరుమల

అధికారులు ఈ ప్రమాదంపై సమీక్షించి మంటలను ఆర్పేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గురువారం ఎయిర్‌ఫోర్స్ నుండి రెండు మిగ్-17 హెలికాప్టర్లతో పాటు 20 మంది సిబ్బందిని రప్పించారు.

తిరుమల

తిరుమల

ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలను కూడా తిరుమలలో ఉన్నారు. కాకులకొండపై మంటలను ఆర్పడానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుండి 10 అగ్నిమాపక వాహనాలను రప్పించారు.

తిరుమల

తిరుమల

వాటర్ ట్యాంకుల ద్వారా తీసుకువెళ్లిన నీరు సరిపోకపోవడంతో సిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కార్చిచ్చును ఆర్పడానికి తమపై మంటలు ఎగసి పడడంతో అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

English summary

 A fire was blazing this evening in the thick forests near the famous Tirupati temple in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X