చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల శేషాచలం అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు పది రోజుల క్రితం మంగళం వద్ద చెలరేగిన మంటలు క్రమంగా ఏడు కొండలకు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత మంగళవారం కొంత తగ్గినప్పటికీ, బుధవారం మళ్లీ ఎగిసిపడుతున్నాయి.

ఈ మంటల్లో వేలాది హెక్టార్లలో అరుదైన వృక్షజాతులు, వన్యప్రాణులు తదితర అటవీ సంపదకు భారీ నష్టం సంభవించింది. అగ్నిమాపక శకటాలు, తిరుమల తిరుపతి దేవస్థానం నీటి ట్యాంకర్లు ఉపయోగించి మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

బుధవారం మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. తిరుమల తిరుపతి ఫారెస్ట్ పరిధిలోకి మంటలు వ్యాపించాయి. మంటలను నియంత్రించడం అధికారులకు కష్టసాధ్యంగా మారింది. శేషాచలం అడవుల్లో మంటలు వ్యాపిస్తుండటంతో పలువురు టిటిడి సిబ్బంది, మీడియా ప్రతినిధులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కాకుమాను కొండ ప్రాంతంలో చెలరేగిన మంటలు పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే గాలిమరల వైపు విస్తరించాయి.

మంటల కారణంగా కొండపై దట్టమైన పొగ వ్యాపించటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాపవినాశనం ఫారెస్ట్‌కు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో 4 ఫైరింజన్లు, 5 టీటీడీ ట్యాంకర్లతో మంటలను అదుపుచేసుందకు ఫైర్ సిబ్బందితో కలిసి రెండువందలమంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మంటలను అదుపుచేసేందుకు పక్క జిల్లాల నుంచి ఫైరింజన్లు, అంబులెన్సలను తిరుమలకు తరలిస్తున్నారు. శేషాచలం అడవిలో కార్చిచ్చుతో రూ.70 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గాలిమరలకు మంటలు వ్యాపించడంతో తిరుమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి మరలతో ఏడాదికి 140 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అలాగే మంటల వల్ల వన్యప్రాణులు రోడ్డు పైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అధికారులు ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు.

హెలికాప్టర్‌ను రంగంలోకి దింపడంలో ప్రతిష్టంభన

మంటలను నియంత్రించేందుకు ఆగమ సలహాదారులను సంప్రదించాక హెలికాప్టర్‌ను రంగంలోకి దించాలనుకున్నారు. హెలికాప్టర్లను రంగంలోకి దింపాలని టిటిడి యోచించింది. అయితే, విశాఖ నేనీ మాత్రం తమ వద్ద మంటలను అదుపు చేయగల హెలికాప్టర్లు లేవని తెలిపింది. దీంతో హెలికాప్టర్ల ద్వారా మంటలు ఆర్పే విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది.

గాలులు విపరీతంగా వీస్తుండటంతో...

గాలులు విపరీతంగా వీస్తుండటంతో మంటలు ఎక్కువవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ను రంగంలోకి దించారు. రాయలసీమలోని దాదాపు అన్ని ఫైరింజన్లను పంపించారు. అయితే, మంటలు అధికంగా ఉండటం, రోడ్డుకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అదుపు చేయడం కష్టమవుతోంది.

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

శేషాచలం అడవులను కార్చిచ్చు దహిస్తోంది. కాకుమానుకొండ ప్రాంతంలో చెలరేగిన మంటలు పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే గాలిమరల వైపు విస్తరించాయి. దీంతో మంటలకు గాలి మరలు దగ్ధమైంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా కొండపై దట్టమైన పొగ వ్యాపించటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

మంగళవారం మధ్యాహ్నం పాపవినాశనం రోడ్డులోని పార్వేటి మండపానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు అదుపుతప్పాయి. దీంతో వేలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమవుతోంది. పాపవినాశనం ఫారెస్ట్‌కు సైతం మంటలు వ్యాపించాయి.

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

దీంతో 4 ఫైరింజన్లు, 5 టీటీడీ ట్యాంకర్లతో మంటలను అదుపుచేసుందకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మంటలను అదుపుచేసేందుకు పక్క జిల్లాల నుంచి ఫైరింజన్లు, అంబులెన్సలను తిరుమలకు తరలిస్తున్నారు.

 తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

శేషాచలం అడవిలో కార్చిచ్చుతో రూ.70 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గాలిమరలకు మంటలు వ్యాపించడంతో తిరుమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి మరలతో ఏడాదికి 140 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మంటలను తాళలేక వన్యప్రాణులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

తిరుమల కొండల్లో కార్చిచ్చు, హెలికాప్టర్లపై ప్రతిష్టంభన

శేషాచలం అడువుల్లో చెలరేగిన మంటలపై టిటిడి అధికారులు స్పందించారు. మంటల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి హెక్టార్లలో అడవి దగ్గమైందని, ఆగమ సలహాదారులను సంప్రదించిన తర్వాత హెలాకాఫ్టర్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేస్తామని జెఈవో శ్రీనివాస రాజు తెలిపారు.

English summary
A major fire broke out in Tirumala forests reportedly ravaging vast areas of vegetation on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X