శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లాకు కరోనా కాటు: తొలి పాజిటివ్ కేసు? ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి..

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ కాటుకు గురి కాని ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలే. మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నప్పటికీ.. ఈ రెండుచోట్ల దాని జాడే కనిపించకుండా పోయింది ఇన్ని రోజులు. వెనుకబాటుతనం ఉన్నా, అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నా కరోనా వైరస్‌ను తమ దరికి చేరనివ్వకుండా ఈ రెండు జిల్లాల ప్రజలు అడ్డుకోగలిగారనే ప్రశంసలు వినిపించాయి.

అదే సమయంలో- శ్రీకాకుళం జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒడిశా సరిహద్దులకు ఆనుకుని ఉండే పాతపట్నంలో ఓ వ్యక్తిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

First covid-19 positive case have reportedly register in Srikakulam district of Andhra Pradesh

పాతపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పాతపట్నం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఆ వ్యక్తి మూడువారాల కిందట ఢిల్లీ నుంచి స్వస్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తోన్న ఆ వ్యక్తి స్వగ్రామానికి వచ్చిన వెంటనే వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

కరోనా..జాన్తానై: సడలింపును ఫుల్లుగా వాడేసుకుంటోన్న బెంగళూరియన్లు: బంపర్ టు బంపర్..ట్రాఫిక్ జామ్కరోనా..జాన్తానై: సడలింపును ఫుల్లుగా వాడేసుకుంటోన్న బెంగళూరియన్లు: బంపర్ టు బంపర్..ట్రాఫిక్ జామ్

నిబంధనల ప్రకారం బయటి నుంచి ఎవరు వచ్చినా 14 రోజుల క్వారంటైన్ పంపించాల్సి ఉన్నందున అతణ్ని స్వీయ గృహ నిర్బంధంలో ఉంచారు. అతనిలో తాజాగా వైరస్ లక్షణాలు కనిపంచినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి వివాహితుడే అయినప్పటికీ.. స్వీయ గృహనిర్బంధంలో ఉండటం వల్ల ఇంట్లో ఎవరూ ఉండట్లేదని తెలుస్తోంది. అతనికి తండ్రి, భార్య, కుమారుడు వేరే చోట నివాసం ఉంటున్నారు.

వైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఈ ముగ్గురినీ కూడా శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో వైరస్ పరీక్షలను నిర్వహించారని అనంతరం వారిని, కోవిడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత అతను తన అత్తామామల ఇంటికి వెళ్లినట్లు తేలడంతో వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇంకా ఎవరెవర్ని కలిశాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

Recommended Video

Corona Hotspot Districts 11 Out of 13 In Andhra Pradesh

English summary
First Covid-19 Positive case have been reportedly registered in Pathapatnam town in Srikakulam district of Andhra Pradesh. The zero cases have registered in Srikakulam district so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X